మంత్రి రోజా ఇంటిపై దాడి.. పలువురిపై కేసులు నమోదు

చిత్తూరు జిల్లా నగరిలో మంత్రి ఆర్కే రోజా ఇంటిఫై కొంతమంది దాడికి పాల్పడ్డారు. దీంతో పోలీసులు దాడికి పాల్పడ్డ 30 మంది ఫై కేసులు నమోదు చేసారు. మంత్రి రోజా ఇంట్లోకి చొరబడేందుకు యత్నించారని కేసులు నమోదు చేశారు. లోకేష్ అంకుల్‌ ఒక ఐరన్‌ లెగ్‌ అని..పప్పు అని ఇలా రోజా చేసిన వ్యాఖ్యలపై టీడీపీ మహిళా నేతలు మండిపడ్డారు. తెలుగు మహిళలు చీర, జాకెట్ తీసుకుని నగరిలో ఉన్న మంత్రి రోజా ఇంటిపైకి వెళ్లారు. ఇంటి ముందు టీడీపీ మహిళా నేతలు ఆందోళన చేపట్టారు. రంగంలోకి దిగిన పోలీసులు వారిని అడ్డుకోవడం, బలవంతంగా అక్కడి నుంచి నగరి పోలీస్ స్టేషన్ కు తరలించారు. మంగళవారం జరిగిన ఈ ఘటనలో మంత్రి ఇంటిపై టీడీపీ నేతలు దాడికి దిగారని..ఇంట్లోకి వెళ్లేందుకు యత్నించారంటూ పోలీసులు 30మంది టీడీపీ నేతలపై కేసులు నమోదు చేశారు.

అంతకు ముందుకు రోజా మంగళవారం మాట్లాడుతూ..లోకేష్ చేస్తుంది పాదయాత్ర కాదు.. అది జోకేశ్‌ యాత్ర అని చెప్పాలి. పాదయాత్ర కోసమని ముందురోజు రాత్రి ఏడు గంటలకే నగరి నియోజకవర్గంలోకి వచ్చిన అతను.. తెల్లారి ఉదయం ఆరు గంటల వరకు పాదయాత్రకు జనాలు రాక టెంటులోనే పడుకున్నాడు. పాపం వాడి పరిస్థితి చూస్తే చాలా జాలేసింది. లోకల్‌ జనాలు రాకపోవడంతో అటు బెంగుళూరు, ఇటు చెన్నై నుంచి అప్పటికప్పుడు జనాన్ని తెచ్చుకుని ఏదో హడావిడి చేశారు. లోకల్‌ జనాలు లేకుండా పాదయాత్రలో లోకేశ్‌ వాగే చెత్తవాగుడు చాలా హాస్యాస్పదంగా ఉంది. నేను సినిమా ఆర్టిస్టు దగ్గర్నుంచి రాజకీయాల్లో కొనసాగుతున్నంత వరకు నా అన్నలు, నా భర్త నన్ను సపోర్టు చేస్తూ సహాయంగా ఉండటంలో తప్పేముంది…?. లోకేశ్‌ అనే వెధవకు నా అన్నల పేర్లు కూడా ఎత్తే అర్హత లేదు. అవినీతికి కేరాఫ్‌ అడ్రస్‌ ఎవరైనా ఉన్నారంటే, అది నారా కుటుంబమేనని చెప్పాలి. చంద్రబాబు, భువనేశ్వరి, బ్రాహ్మిణి, లోకేశ్‌ లే అవినీతి చక్రవర్తులుగా గుర్తింపు పొందారు. చిత్తూరు జిల్లాలో పాలు పోసేవాళ్లు, కూరగాయలు పండించి అమ్మేవాళ్లు ఇంకా పేదరికంలోనే ఉన్నారు. కానీ, వాళ్ల కష్టాన్ని దోచుకుని హెరిటేజ్‌ నడుపుతూ ఏ విధంగా కోటీశ్వరుడయ్యాడో చంద్రబాబు బహిరంగంగా సమాధానం చెప్పాలి..? కేవలం, రెండెకరాల రైతు చంద్రబాబు, ఏ విధంగా వేల కోట్లకు పడగలెత్తాడో చిత్తూరు ప్రజలకు తెలుసు కనుకనే ఎప్పుడు ఎన్నికలొచ్చినా ఆయన చావుతప్పి కన్ను లొట్ట పడ్డ చందంగా నానాపాట్లు పడతూ అవమానాల పాలవడం అందరూ చూస్తూనే ఉన్నారని రోజా అన్నారు.

లోకేశ్ అడుగుపెట్టిన దగ్గర్నుంచి రాష్ట్రానికి, ఎన్టీఆర్ కుటుంబానికి, మీ పార్టీ నేతలకి ఏదో ఒక అరిష్టం జరుగుతూనే ఉంది. నీ అడుగు మహత్యం వల్ల.. జరిగిన నష్టాలకు సంబంధించి లెక్కలు తీసి చూసుకుంటే తెలుస్తుంది. లోకేశ్‌ రాజకీయ ఎంట్రీతోనే చంద్రబాబు రాజకీయ పతనం మొదలైంది. అతని పాదయాత్ర అనగానే జనాలు పిట్టల్లా చనిపోతున్నారు. లోకేశ్‌లాంటి ఐరెన్‌లెగ్‌ అంకుల్‌ పాదయాత్ర అనగానే జనాలు భయపడి బయటకు రాకుండా ఇళ్లకు తలుపులేసుకుంటున్నారు. జనాల కోసం లోకేశ్‌ పదిగంటలు, పన్నెండు గంటలు వేచిచూస్తూ అభాసుపాలవుతున్నాడు. అదే నేను ఎక్కడికి వెళ్లినా జనాలు బ్రహ్మరథం పడతారు. మరి, నేను, లోకేశ్‌ ఒకచోటికి వెళ్తే జనాలు ఎవరికి హారతులు పడతారో.. డిబేట్లు పెట్టుకుని చర్చించుకోవాలి అన్నారు.