రాజస్థాన్‌ బస్సు ప్రమాదంలో 13 మంది మృతి

bus accident
bus accident


జైపూర్‌: రాజస్థాన్‌లో జరిగిన రోడ్డు ప్రమాదంలో 13 మంది అక్కడిక్కడే మృతిచెందగా, చాలా మంది గాయపడ్డారు. వారిని సమీప ఆసుపత్రికి తరలించారు. బస్సు ప్రమాదంతో ఆ ప్రాంతమంతా గాయపడిన వారి రోదనలతో నిండిపోయింది. రాజస్థాన్‌లోని డందానియా పోలీస్‌స్టేషన్‌ పరిధిలోని బలేసర్‌ మండలం జోధ్‌పూర్‌ వద్ద 125వ జాతీయ రహదారి వద్ద బస్సు మహీంద్ర బోలెరోను ఢీకొంది. బస్సులో ఉన్న ప్రయాణికులు తీవ్రంగా గాయపడ్డారు. వెంటనే వారిని బలెసర్‌ ఆసుపత్రికి తరలించారు. తీవ్రగాయాలతో ఉన్న ఎనిమిది మందిని జోద్‌పూర్‌కు తరలించారు. వీరిలో కొందరి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. ఈ ప్రమాదంలో 13 మంది చనిపోయారు. వీరిలో ఏడుగురు పురుషులు కాగా, అయిదుగురు స్త్రీలతో పాటు ఒక చిన్నారి కూడా ఉన్నారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. బస్సు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డ కొందరి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశముందని వివరించారు. పోలీసులు, రెవిన్యూ సిబ్బంది సహాయ చర్యలు చేపట్టారు.
తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి..https://www.vaartha.com/news/national/