మునుగోడు లో టిఆర్ఎస్ లోకి భారీగా చేరికలు

మునుగోడు నియోజకవర్గం లో అధికార పార్టీ టిఆర్ఎస్ లోకి భారీగా వలసలు చేరుతున్నారు. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ కీలక నేతలు చేరగా..తాజాగా ఆరు గ్రామాల సర్పంచ్ లు కారెక్కారు. నియోజకవర్గంలోని చండూరు, మునుగోడు మండలాలకు చెందిన ఆరుగురు సర్పంచులు హైదరాబాద్ లో మంత్రి జగదీశ్‌రెడ్డి సమక్షంలో టీఆర్‌ఎస్‌లో చేరారు. కస్తాల సర్పంచ్ ద్రౌపధమ్మా వెంకట్ రెడ్డి, నెర్మట సర్పంచ్ నందికొండ నర్సిరెడ్డి , గుండ్ర పల్లి సర్పంచ్ తీగల సుభాశ్, దోనిపాముల సర్పంచ్ తిప్పర్తి దేవేందర్, తుమ్మలపల్లి సర్పంచ్ కూరపాటి రాములమ్మ సైదులు చండూరు జడ్పీటీసీ కర్నాటి వెంకటేశం ఆధ్వర్యంలో పార్టీలో చేరారు. ఈ సందర్భంగా విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్ రెడ్డి వారికి గులాబి కండువా కప్పి స్వాగతం పలికారు.
మునుగోడు మండలం కోతులారం సర్పంచ్ , మండల సర్పంచ్ ల ఫోరం అధ్యక్షురాలు జాజుల పారిజాత , సత్యనారాయణ గౌడ్ దంపతులు మంత్రి సమక్షంలో టీఆర్‌ఎస్‌లో చేరారు. మునుగోడు మండలం కిష్టాపురానికి చెందిన కాంగ్రెస్ సీనియర్ నేతలు మానుకుంట్ల కుమార స్వామి గౌడ్, పంతగి లింగస్వామి గౌడ్ , సురుగి లింగ స్వామి గౌడ్, సురిగి రాజు సురిగి వెంకన్న, జాజుల శ్రీశైలం తదితరులు చండూరు మార్కెట్ వైస్ చైర్మన్, మాజీ జడ్పీటీసీ జాజుల అంజయ్య గౌడ్ ఆధ్వర్యంలో పార్టీలో చేరారు.