కార్మిక రాజ్య బీమాలో అవి’నీతి జలగలు!

తెలంగాణాలో విజిలెన్స్‌ రిపోర్టు ప్రకారం అందరిపై దాడులు విపరీతంగా జరిపి గుట్టురట్టు చేసి పాపుల్ని జైళ్లకు పంపారు. మరి ఆంధ్రప్రదేశ్‌లో ఇంకా అలాంటి చలనం వచ్చినట్లు లేదు. రాజకీయ పార్టీ నాయకులు కూడా ఒకరినొకరు విమర్శించుకోవడంలోనే తలమునకలయ్యారు. ప్రభుత్వమన్నా సత్వరమే స్పందించి దర్యాప్తు ముమ్మరం చేసి నష్టాన్ని రాబట్టి దోషుల్ని జైళ్లకు పంపి మళ్లీ భవిష్యత్తులో ఇలాంటి దుర్మార్గం జరగకుండా చూడాలి. అప్పుడే ప్రభుత్వంపైన, వ్యవస్థలపైన నమ్మకం కలుగుతుంది.

మ న జన్మభూమి బంగారు భూమి.. పాడి పంటలతో పసిడి కాంతులతో ఇలా ఎన్నెన్నో గీతాలు మనల్ని అలరించాయి కాదు అలరిస్తూనే ఉంటాయి. కానీ మన దేశం నలుమూలల నుండి మనకు చల్లటి గాలే కాదు దానితోపాటు అవినీతి కంపు కూడా వీస్తుంటుంది. నేడు దేశం నలుమూలలా అవినీతి ప్రవాహాన్ని చూస్తున్నాం. అవినీతి లేని చోటు ఎక్కడ అన్నది నేటి బేతాళ ప్రశ్న. అవినీతి అన్నది మనందరి జీవితాల్లో ఒక భాగమై పోయింది. అవినీతి ముమ్మాటికీ కేన్సర్‌ కన్నా కొవిడ్‌-19 వైరస్‌ కన్నా భయంకరమైంది. ఒకసారి భారత ప్రధానిగా రాజీవ్‌గాంధీ ఉన్నప్పుడు ఓ గొప్ప సత్యాన్ని నిర్భయంగా ప్రకటించి అందరి దృష్టిని ఆలోచింపచేశారు. ప్రభుత్వం ఖర్చుపెడుతున్న ప్రతి వంద రూపాయల్లో కూడా వాస్తవంగా లబ్ధిదారుడికి చేరుతున్నది 15 రూపాయలు మాత్రమే అన్నది ఆయన చెప్పిన సారాంశం. ఈ అవినీతి దాదాపు ప్రపంచంలోని అన్ని దేశాల్లో కూడా ఉంది. నిరక్షరాస్యత, చాలీచాలని జీతాలు, డబ్బు సంపాదించాలన్న అత్యాశ, చట్టాల్లోని లోపాలు, జనాభా పెరిగిపోతుండటం, స్వార్థం, అనుమతుల మంజూరుల్లో పారదర్శకత లేకపోవడం, ఓటర్లు డబ్బులడగడం, ఆర్థికవృద్ధి మందగమనం, జవాబుదారీ తనం లేకపోవడం, శిక్షలు కఠినంగా లేకపోవడం ఇవన్నీ కాకుండా మనిషిలో మానవత్వం నశించడం అవినీతికి ప్రధాన కారకాలుగా చెప్పవచ్చు. రాజకీయ నాయకులు, ఉద్యోగస్తులు, కాంట్రాక్టర్లు, వ్యాపారస్తులు, కీలక స్థానాల్లో ఉన్నవారు అందరూ ఇందులో భాగస్వాములే. ఆనాడు ఈస్ట్‌ ఇండియా కంపెనీ మనదేశంలోకి ప్రవేశించిందే అవినీతి మార్గం ద్వారా. ఈ అవినీతి మహమ్మారిని మనదేశం నుండి పారద్రోలేందుకు లేదా డయాబెటిస్‌ లాగా కొంతైనా కంట్రోల్‌ చేసేందుకు 1974లో జయప్రకాశ్‌ నారాయణ, 2011లో అన్నహజారే ప్రజా ఉద్యమం ద్వారాను, రామ్‌దేవ్‌బాబా భారత్‌ స్వాభిమాన్‌ ఆందోళన ద్వారాను విస్తృత ప్రయత్నాలే చేశారు. అవినీతికి వ్యతిరేకంగా గళమెత్తిన ఈ నాయకుల వెంబడి ఆనాడు దేశమంతా కూడా నడిచింది. ర్యాలీలు, నిరాహరదీక్షలు, బహిరంగ సభలు, బంద్‌లు తదితర అన్ని మార్గాల్లో పోరాడారు. ఒక్క లోక్‌పాల్‌ బిల్లు తీసుకురావడం వరకే వాళ్ల ఉద్యమాలు ఫలించాయి. అవినీతి అప్పుడు కాస్తా మందగమనంతో సాగినా, ఆ తర్వాత మళ్లీ మహావృక్షంలా పెరిగిపోతూనే ఉంది. అవినీతి వ్యతిరేకంగా ఎన్నో చట్టాలున్నాయి. కానీ వాటిల్లో ‘సత్తా లేదు. ఐపిసి 1860,ప్రాసిక్యూషన్‌ సెక్షన్‌ ఆఫ్‌ ఇన్‌కంటాక్స్‌ 1961, ప్రివెన్షన్‌ ఆఫ్‌ కరప్షన్‌ యాక్ట్‌ 1988 ఇంకా చాలానే ఉన్నాయి. 1964లో చీఫ్‌ విజిలెన్స్‌ కమిషన్‌ ఏర్పరిచారు. 1963 ఏప్రిల్‌ ఒకటిన సెంట్రల్‌ బ్యూరో ఆఫ్‌ ఇన్వెస్టిగేషన్‌ను కూడా ఏర్పరి చారు. ఇన్ని ఉన్నా ఇవి నిస్సత్తువ్ఞగానే పనిచేస్తున్నాయి. మన రాష్ట్రానికొస్తే సిబిఐ, సెంట్రల్‌ విజిలెన్స్‌తోపాటు యాంటీ కరప్షన్‌ బ్యూరో, స్టేట్‌ విజిలెన్స్‌ కమిషన్‌ అనే సంస్థలు కూడా అవినీతిని ఏరివేసే పనిలో ఉన్నారు. ఇవి కూడా అప్పుడప్పుడు చాలా చురుగ్గా పనిచేసి మళ్లీ చాలా కాలం నిద్రపోతూ ఉంటాయి. ఇది మన దురదృష్టమో లేక మన దౌర్భాగ్యమో. హైదరాబాద్‌ ఎయిర్‌ పోర్టులో కస్టమ్స్‌ వాళ్లు చురుగ్గా వ్యవహరించిన రోజు ఖచ్చితంగా ఎన్నో కేజీల దొంగ బంగారం దొరుకుతుంది. మరి వాళ్లు రోజూ అలా ఎందుకుండరో ఎవరికీ తెలియదు. అదేవిధంగా ఎసిబి వాళ్ల పరిస్థితి కూడా అలాగే ఉంటుంది. ఒక్కోరోజు ఒక్కో అధికారిపై దాడి చేస్తారు.ఆ అధికారి 100కోట్లకుపైగా అక్రమార్జనచేసి ఉంటా డు. మరి విస్తృతంగా ఎందుకు దాడులు చేయరు? రెవెన్యూ, మున్సిపాలిటీ, ట్రాన్స్‌పోర్టు లాంటి సంస్థలపై క్రమం తప్పకుండా దాడులు జరుపుతుంటే అధికార్లు అవినీతి జోలికి వెళ్లేందుకు కాస్తాయినా భయపడతారు. ఇటీవలి కాలంలో తెలుగు రాష్ట్రాల్లోని ఇఎస్‌ఐ సంస్థల్లో అతిపెద్ద అవినీతి అనకొండలు దొరకడం చాలా పెద్ద స్కామ్‌గా పేర్కొనవచ్చు. తొలుత 27 సెప్టెంబర్‌ 2019లో తెలంగాణ రాష్ట్రంలో విజిలెన్స్‌ దర్యాప్తులో అతిపెద్దస్కాం బయట పడింది. అదే తరహాలో ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖలో 21 ఫిబ్రవరి 2020లో కూడా అంతే పెద్దస్కాం ఇఎస్‌ఐలో జరగడం పెద్ద సంచలనంగా మారి, మొట్టమొదటిసారిగా ఇఎస్‌ఐసి గూర్చిన చర్చ దేశ ప్రజలందరిలోనూ మొదలైంది. అసలు అంతవరకు ఇఎస్‌ఐ గూర్చి పూర్తిగా ఎవరికీ తెలిసేదికాదు. భారత కార్మికుల భద్రత, ఆరోగ్యరక్షణ కోసం ఏర్పాటు చేసిన సంస్థ ఇఎస్‌ఐ కార్పొరేషన్‌ 1943లో కార్మికుల సంక్షేమం కోసం ప్రొII బి.పి అదర్‌కర్‌ని ప్రభుత్వం ఒక నివేదిక తయారు చేయడానికి నియమించింది. ఆయన ఇచ్చిన నివేదిక ప్రకారం 1948 ఇఎస్‌ఐకి సంబంధించిన యాక్ట్‌ రూపొందించారు.ఈ సంస్థ భారతదేశంలోని కార్మికులందరి కోసం ఏర్పాటు చేశారు. 20వేలు, అంతకు లోపల వేతనం తీసు కుంటున్న కార్మికులకు ఈ సంస్థ ఆర్థిక, ఆరోగ్య రక్షణ కల్పిస్తుం ది. కార్మికులు తమ జీతం నుండి 0.75 శాతం నిధుల్ని యాజ మాన్యం 3.25 శాతం నిధుల్ని ఇప్పుడు నాలుగుశాతం నిధుల్ని ఇందుకోసం చేకూర్చాలి. ఇదితొలుత ఫ్యాక్టరీల్లోని భారత కార్మికుల కోసమే ఏర్పాటు చేసినా కాలక్రమంలో ఇది 10 మంది వర్కర్స్‌ ఉన్న ప్రతి సంస్థను దీనికింద చేర్చారు. ఈ సంస్థ కింద ఇప్పటికి 1418 డిస్పెన్సరీలు, 145 ఇన్‌పేషెంట్‌ హాస్పిటల్స్‌,42 హాస్పిట ల్స్‌ భారతదేశమంతా నిర్వహిస్తున్నారు. మొత్తం 19,387 బెడ్ల సౌకర్యం కార్మికులకు అందుబాటులో ఉంది. ఈ సంస్థ కేంద్ర కార్మిక సంక్షేమశాఖ ఆధ్వర్యంలో ఉంటుంది. ఈ సంస్థ మెడికల్‌, డెంటల్‌, నర్సింగ్‌, కాలేజీలు, పారామెడికల్‌ స్కూల్స్‌ కూడా నడుపుతున్నది. ఇంకో మూడు మెడికల్‌ కాలేజీలు కూడా రాబోతు న్నాయి. 2017-18లో 12.40 కోట్ల మంది ఈ హాస్పిటల్స్‌ ద్వారా లబ్ధిపొందారు.ఏ కార్మికుడు అయినా లేదా వారి కుటుంబ సభ్యులు అనారోగ్యానికి గురైనప్పుడు ఇవి ఉచిత సేవ అంది స్తాయి.2017-18లో ఇఎస్‌ఐ వార్షిక నివేదిక ప్రకారం వీటికైన ఖర్చు 6867.73 కోట్లు. మారుతున్న కాలంలో ప్రతి వ్యక్తికి ఆరోగ్యసేవలు చాలా ముఖ్యం. కార్పొరేట్‌ హాస్పిటల్స్‌ వచ్చాక వైద్యం చాలా ఖరీదైపోయి సామాన్య మానవ్ఞడికి అందుబాటులో కూడా లేకుండా పోయింది. విదేశాల్లో లాగా హెల్త్‌ ఇన్సూరెన్స్‌లు ఇక్కడ ఎక్కువగా లేవ్ఞ. ఇలాంటి పరిస్థితుల్లో కార్మికులకు మాత్రం ఇఎస్‌ఐ సేవలు చాలా లాభదాయకంగా ఉన్నాయి. ఇటువంటి సంస్థల్లో అవినీతి రాక్షసులు రాబందుల్లా చొరబడి నిధులు స్వాహా చేసి కార్మికుల కడుపులు కొడుతున్నారు. తెలంగాణ రాష్ట్రంలో 2015లో ఈ సంస్థ డైరెక్టర్‌గా చార్జి తీసుకున్న ‘దేవికారాణి ఈ స్కాంకు ప్రధాన సూత్రధారి. నాసిరకం మందులు, గుడువ్ఞ దాటిన మందులు కొనటం ఎంత దుర్మార్గం? గత ఏడాది సెప్టెంబరు 27న విజిలెన్స్‌ వారు ఉన్న పళంగా దాడులు చేశారు. ఒక్కసారిగా అన్ని కార్యాలయాలపై దాడులు జరిపారు. ఈమె అవినీతి లీలలు పుంఖానుపుంఖాలుగా బయటపడ్డాయి.ఇంత పెద్ద స్కాం బయటపడటం ఇదే మొదటిసారి. ఈ స్కాంలో 80శాతం మంది మహిళలే కావడం కూడా ఆశ్చర్యం. ఈ సంస్థ ప్రతి ఏటా 200 కోట్ల రూపాయలు వెచ్చించి మందులుకొంటుంది. టెండర్స్‌ లో పాల్గొని ఎంపికైన సంస్థలతో రేటు, కాంట్రాక్టు కుదుర్చుకొని వారి నుండి మందులు కొనడం చేయాలి. నియమనిబంధలన్నీ తుంగలో తొక్కి తనకిష్టమైన సంస్థల నుండి తన బినామి సంస్థల నుండి ఎక్కువ ముడుపులు ఇచ్చి వారి నుండి మందులు కొనేది. అంతేకాకుండా హెల్త్‌క్యాంప్‌ పెట్టినట్లుగా చూపి దొంగ బిల్లులు పెట్టడం కూడా చేసేవారు. కొన్న మందులన్నింటికీ 300 శాతం అధికంగా ధరలు చెల్లించింది. చివరకు దేవికారాణి, ఆమె భర్తను కూడా అరెస్టుచేసి ఐపిసి455(ఎ), 468, 471, 420, 120-బి, 34 కింద కేసులు బుక్‌ చేశారు. ఆశ మనిషికి ఉండటం సహజ మే.కానీ అది అత్యాశగామారితేనే ప్రమాదం. ఇక ఆంధ్రప్రదేశ్‌లోని ఇఎస్‌ఐలో కూడా అచ్చం ఇలాంటి స్కామే ఈ నెల 21న వెలుగు చూసింది. ఇప్పటికి దాదాపు రూ.500 కోట్ల అవకతవకలు ఈ ఐదేళ్లలో జరిగిందని విజిలెన్స్‌ విచారణలో తేలింది. ఇది ప్రాథ మిక విచారణ మాత్రమే. తోడితే ఎన్నివేల కోట్ల అవినీతి బైటపడు తుందో కాలమే నిర్ణయిస్తుంది.ఈ స్కామ్‌ వెనుక రాజకీయ కోణం కూడా వెలుగుచూసింది. తెలంగాణలో రాజకీయ నాయకుల ప్రమే యం ఎక్కడా కన్పించలేదు.సగటున అన్నింటిపై 132 శాతం అధి కంగా ధరలు చెల్లించారు. టన్నుల కొద్దీ మందులు స్టాక్‌ ఉన్నా రోగులకు ఇవ్వకుండా గోడౌన్‌లలో నిరుపయోగంగా పడేశారు. తెలంగాణాలో విజిలెన్స్‌రిపోర్టు ప్రకారం అందరిపై దాడులువిపరీ తంగా జరిపి గుట్టురట్టు చేసి పాపుల్ని జైళ్లకు పంపారు. మరి ఆంధ్రప్రదేశ్‌లో ఇంకా అలాంటిచలనం వచ్చినట్లు లేదు. రాజకీయ పార్టీల నాయకులు కూడా ఒకరినొకరు విమర్శించుకోవడం లోనే తలమునకలయ్యారు. ప్రభుత్వమన్నా సత్వరమే స్పందించి దర్యాప్తు ముమ్మరం చేసి నష్టాన్ని రాబట్టి దోషుల్ని జైళ్లకు పంపి మళ్లీ భవిష్యత్తులో ఇలాంటి దుర్మార్గం జరగకుండా చూడాలి. అప్పుడే ప్రభుత్వంపైన, వ్యవస్థలపైన నమ్మకం కలుగుతుంది.