పర్యాటకానికి ద్వారాలు తెరిచిన కాశ్మీర్‌

KASHMIR
KASHMIR

శ్రీనగర్‌: రెండు నెలల విరామం తరువాత కాశ్మీర్‌ పర్యాటకుల కోసం తిరిగి ద్వారాలు తెరిచింది. ఉగ్రవాదుల దాడులు జరుగుతాయన్న భయంతో కాశ్మీర్‌లో కొంతకాలంపాటు పర్యాటకాన్ని నిలిపివేశారు. రాష్ట్రంలో భద్రతపై రక్షణ దళాల సమీక్షతో సలహాదారులు, ప్రధాన కార్యదర్శితో సమావేశమైన గవర్నర్‌ సత్యపాల్‌మాలిక్‌ కాశ్మీర్‌ పర్యాటక నిలిపివేతను ఎత్తివేస్తున్నట్లు ప్రకటించారు. జమ్మూకాశ్మీర్‌ స్వయంప్రతిపత్తికి సంబంధించి ఆర్టికల్‌ 370 రద్దుకు ముందుగానే రాష్ట్రంలో ఉగ్రదాడులు జరుగుతాయన్న అనుమానం కేంద్రం ఆగస్టు 2న అమర్‌నాథ్‌ యాత్రను రద్దు చేసింది. అదేవిధంగా కొంతకాలం పాటు పర్యాటకాన్ని కూడా నిలిపివేసింది. మరోవైపు పాలనా యంత్రాంగం యూనివర్సిటీలు, కాలేజీలు, సెకండరీ స్కూళ్లను తిరిగి తెరిచారు. శ్రీనగర్‌లోని శ్రీప్రతాప్‌ కాలేజీలో రక్షణ సిబ్బంది విద్యార్థుల గుర్తింపు కార్డులను తనిఖీ చేసి క్యాంపస్‌లోనికి అనుమతిస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం ఆగస్టు 5న ఆర్టికల్‌ 370 రద్దుతో జమ్మూకాశ్మీర్‌, లడఖ్‌లను కేంద్ర పాలిత ప్రాంతాలుగా విభజించిన రెండు నెలల తరువాత నిబంధనను ఎత్తివేసింది. మొబైల్‌, ఇంటర్‌నెట్‌ సర్వీసుల నిలిపివేత రాష్ట్రంలో ఇంకా కొనసాగుతోంది. శ్రీనగర్‌లో అక్టోబర్‌ 6న నేషనల్‌ కాన్ఫరెన్స్‌ అధ్యక్షుడు ఫరూక్‌ అబ్దుల్లా, ఒమర్‌ అబ్దుల్లాలు దౌత్యవేత్తలతో సమావేశమయ్యేందుకు కేంద్రం అనుమతించింది.

ఆగస్టు నుండి పిడిపి నాయకురాలు మెహబూబా ముఫ్తీ, ఫరూక్‌, ఒమర్‌ అబ్దుల్లాలు నిర్బంధంలో ఉన్నారు. అక్టోబర్‌ 24న అభివృద్ధి కౌన్సిల్‌ ఎన్నికలు నిర్వహించాలని పాలనాయంత్రాంగం నిర్ణయించింది. జమ్మూకాశ్మీర్‌లో ఈ ఎన్నికల ప్రక్రియ ఆగస్టు 5న నుండే జరుగుతున్నది. జమ్మూకాశ్మీర్‌లో రాజకీయ నాయకులు నిర్బంధంలో ఉన్నందున్న కాంగ్రెస్‌ ఈ ఎన్నికలను బా§్‌ుకాట్‌ చేయాలని నిర్ణయించింది. పార్టీని పటిష్టపరుకునేందుకు కాంగ్రెస్‌ ఎన్నికలకు దూరంగా ఉండాలని భావిస్తున్నట్లు తెలుస్తున్నది. సీనియర్‌ నాయకుల నిర్బంధాన్ని పాలనాయంత్రంగా ఇంకా కొనసాగిస్తున్నందున బిడిసి కూడా ఎన్నికలను బా§్‌ుకాట్‌ చేయాలని నిర్ణయం తీసుకుందని జమ్మూకాశ్మీర్‌ కాంగ్రెస్‌ అధ్యక్షుడు గులామ్‌ అహ్మద్‌ మీర్‌ చెప్పారు.
తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి..https://www.vaartha.com/news/national/