ప్ర‌తి కుటుంబానికి 3సిలిండ‌ర్లు ఉచితం: సీఎం ప్ర‌మోద్ సావంత్

గోవా : గోవా సీఎం ప్ర‌మోద్ సావంత్ ప్ర‌తి కుటుంబానికి మూడు ఎల్ పిజి సిలిండ‌ర్ల‌ని ఉచితంగా ఇస్తామ‌ని ప్ర‌క‌టించారు. ఈ విషయంలో బీజేపీ తన ఎన్నికల మేనిఫెస్టోలో వాగ్దానం చేసింది. కొత్త కేబినెట్ మొదటి సమావేశానికి అధ్యక్షత వహించిన తర్వాత సీఎం ప్రమోద్ సావంత్ ఈ విషయాన్ని ప్రకటించారు. ప్రమోద్ సావంత్ ఒక ట్వీట్‌ను పోస్ట్ చేసారు. ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత మొదటి సమావేశానికి అధ్యక్షత వహించారు. బిజెపిలో వాగ్దానం చేసిన విధంగా మూడు సిలిండర్లను ఉచితంగా అందించే ప్రణాళికను సిద్ధం చేయాలని కేబినెట్ నిర్ణయించింది. కొత్త ఆర్థిక సంవత్సరం నుంచి మేనిఫెస్టో అమ‌లు కానుంది. ఈ స‌మ‌యంలో బీజేపీ ఇచ్చిన హామీని నెరవేర్చుకోనుంది. ఈ హామీని నెరవేర్చడం ద్వారా బీజేపీ మరోసారి తన అడుగులు ముందుకు వేసి బలోపేతం చేసేందుకు కృషి చేస్తోంది.

తాజా ఏపీ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/andhra-pradesh/