ఆరెస్సెస్‌ కన్నుసన్నల్లో భారత్‌!

మరోసారి ఇమ్రాన్‌ అక్కసు

Imran Khan
Imran Khan


ఇస్లామాబాద్‌: భారత్‌లోని బిజెపి, ఆర్‌ఎస్‌ఎస్‌లపై పాకిస్తాన్‌ప్రధాని ఇమ్రాన్‌ఖాన్‌ ధ్వజమెత్తారు. ఆర్‌ఎస్‌ఎస్‌ నాజీ సిద్ధాంతాల తోనే స్ఫూర్తి పొందిందని మండిపడ్డారు. కశ్మీర్‌ భౌగోళిక స్వరూపాన్ని మార్చేందుకు యత్ని స్తోందని, రానున్న కాలంలో పాకిస్తాన్‌నుకూడా లక్ష్యంగాచేసుకుంటుందని ఆరోపించారు. జర్మనీ లో నాజీ సిద్దాంతాలు, భావజాలంతో రాష్ట్రీయ స్వయం సేవక్‌సంఘ్‌ స్పూర్తిపొం దిందని విమ ర్శించారు. కశ్మీర్‌లో కర్ఫూర్య అణిచివేతతో పాటు సామూహిక హత్యలకు ఆ సంస్థ కుట్రపన్నుతోందని ఆరోపించారు. జాతిహననం ద్వారా కాశ్మీర్‌భౌగోళిక స్వరూపాన్ని మార్చేందుకు కుట్రలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేసారు.నాజీ జాతీయవాదం తరహాలో ఆరెస్సెస్‌ జాతీయాదం కేవలం కశ్మీర్‌వరకే ఆగిపోదని, భారత్‌లోని ముస్లింలందరినీ వీళ్లుఅణిచి వేస్తారన్నారు. చివరికి పాకిస్తాన్‌ను లక్ష్యంగా చేసు కుంటారని, వీళ్లంతా హిట్లర్‌జాతీయ వాదానికి హిందూ వెర్షన్‌లాంటివారని ఎద్దేవాచేసారు గతంలో తమజాతే గొప్పదన్న హిట్లర్‌ను సహించినట్లు ప్రపంచ దేశాలు ఈ వైఖరిని కూడా చూసీచూడనట్లు ఊరుకుంటాయా అని ఇమ్రాన్‌ ప్రశ్నించారు. హిందూ ఆధిపత్యదోరణి కలిగిన ఆరెస్సెస్‌ కనుసన్నల్లో మోడీప్రభుత్వం పనిచేస్తోందని ఆరోపించారు. నాజీ ఆర్యన్‌ ఆధిపత్యం వలే హిందూ ఆధిపత్యంతోకూడిన ఆర్‌ఎస్‌ఎస్‌భావజాలంపైనే ఆందోళన వ్యక్తం చేస్తున్నట్లు ఇమ్రాన్‌ తన వరుసట్వీట్లలో భారత్‌పై అక్కసు వెళ్లగక్కారు.


తాజా క్రీడా వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/sports/