పాకిస్థాన్‌ తమకు ముఖ్యమైన దేశం: ప్రిన్స్‌విలియం

prince william
prince william

ఇస్లామాబాద్‌: పాకిస్థాన్‌ దేశంతో తమకు స్నేహసంబంధాలున్నాయని, పాకిస్థాన్‌ తమకు అత్యంత ముఖ్యమైన దేశమని బ్రిటన్‌ రాజవంశీకుడు ప్రిన్స్‌ విలియం పేర్కొన్నారు. పాక్‌లో పెట్టుబడులు పెడుతున్న దేశాల్లో యునైటెడ్‌ కింగ్‌డమ్‌ అగ్రస్థానంలో ఉందని పేర్కొన్నారు. బాలికా విద్య, సమానత్వం, వాతావరణ మార్పు తదితర సామాజిక అంశాలపై ప్రిన్స్‌ విలియం దంపతులు వివిధ దేశాల్లో పర్యటిస్తూ అవగామన కల్పిస్తున్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగా డ్యూక్‌ ఆఫ్‌ కేంబ్రిడి ప్రిన్స్‌ విలియం, డచెస్‌ ఆఫ్‌ కేంబ్రిడ్డి కేట్‌ మిడిల్టన్‌ ఐదురోజుల పాక్‌ పర్యటనకు బయల్దేరారు. ఈ క్రమంలో పాకిస్థాన్‌ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్‌, అధ్యక్షుడు అల్విలను రాజ దంపతులు మర్యాదపూరకంగా కలుసుకున్నారు. ఈ సందర్భంగా సామాజిక అంశాల అవగాహనపై విలియం దంపతులు చేస్తున్న కృషిని ఇమ్రాన్‌ఖాన్‌ అభినందించారు. యువ పాకిస్థానీలతో రాజకుటుంబీకులు భేటీ కావడం తమకు సంతోషంగా ఉందన్నారు. ఈ క్రమంలో ప్రిన్స్‌ డయానాకు పాకిస్థాన్‌ ప్రజలో ఉన్న అనుబంధాన్ని ఆయన గుర్తు చేసుకున్నారు.

తాజా అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి..https://www.vaartha.com/news/international-news/