మోడి ప్రమాణస్వీకారనికి ఇమ్రాన్‌ను ఆహ్వానించలేదా!

న్యూఢిల్లీ: ఈనెల 30న నరేంద్రమోడి భారత ప్రధానిగా రెండవసారి ప్రమాణ స్వీకారం చేయనున్నారు. అయితే ఈ సందర్భంగా బిమ్స్టెక్ దేశాధినేతలకు ఆహ్వానం పంపారు. కానీ పొరుగు దేశం పాకిస్థాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ పేరు మాత్రం ఆహ్వానితుల జాబితాలో లేదు. బంగాళాఖాతం చుట్టూ ఉండే దేశాలకు భారత్ ఆహ్వానం అందించింది. బిమ్స్టెక్ కూటమిలో ఇండియాతో పాటు బంగ్లాదేశ్, మయన్మార్, శ్రీలంక, థాయిలాండ్, భూటాన్, నేపాల్ దేశాలు ఉన్నాయి. పొరుగువారితో స్నేహసంబంధాలు కలిగి ఉండాలన్న ఉద్దేశంతోనే బిమ్స్టెక్ దేశాధినేతలుకు ఆహ్వానం పంపినట్లు విదేశాంగ శాఖ వెల్లడించింది. కిర్గిస్తాన్ అధ్యక్షుడు సూరన్‌బే జీన్బెకోవ్, మారిషెస్ ప్రధాని ప్రవింద్ జుగన్నాథ్, బంగ్లా అధ్యక్షుడు అబ్దుల్ హమీద్, నేపాల్ ప్రధాని కేపీ శర్మ ఓలీ, భూటాన్ ప్రధాని లేటే సేరింగ్ కూడా ప్రమాణస్వీకారోత్సవానికి హాజరుకానున్నారు. థాయ్‌ల్యాండ్, మయన్మార్ నుంచి ఎవరు వస్తారన్న దానిపై ఇంకా స్పష్టత లేదు. పాక్ ప్రధాని ఇమ్రాన్‌కు ఆహ్వానం లేకపోయినా.. గత ఆదివారం ఆయన మోదీతో ఫోన్లో మాట్లాడారు. ఇమ్రాన్‌కు ఆహ్వానం అందని అంశంపై పాక్ విదేశాంగ మంత్రి షా మెహమూద్ ఖురేషి స్పందించారు.
తాజా అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి:https://www.vaartha.com/news/international-news/