‘నన్ను హత్య చేసేందుకు కొందరు కుట్ర’

పాకిస్థాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ సంచలన వ్యాఖ్యలు

Imran Khan comments- Some conspired to kill me'
Imran Khan comments- Some conspired to kill me’

పాకిస్థాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ తన ప్రాణాలకు ముప్పు ఉందని పేర్కొన్నారు.. తనను హత్య చేసే కుట్రలో పాల్గొన్న వారందరి పేర్లను వీడియో రికార్డ్ చేసినట్లు సియాల్‌కోట్‌లో జరిగిన పార్టీ భారీ సమావేశంలో ఆయన పై విధంగా స్పందించారు. . ఈ కుట్రపై ఒక వీడియోను రికార్డ్ చేసి దాన్ని ఒక రక్షిత స్థలంలో ఉంచానని తెలిపారు. తనకు ఏదైనా జరిగితే ఆ వీడియో దేశం ముందు బహిర్గతం అవుతుందని పేర్కొన్నారు. తనపై ఎవరు కుట్ర పన్నారో, ఎవరెవరు సహకరించారో, అందరి పేర్లు పెట్టానని ఆయన వెల్లడించారు.

జాతీయ వార్తల కోసం : https://www.vaartha.com/news/national/