కొత్త ఏడాదిలోనూ ఎయిర్‌ ట్రావెల్‌ పైనా ప్రభావం

ఇపుడే కోలుకునే అవకాశాలు లేవని ఏవియేషన్‌ నిపుణుల భావన!

Impact on Air Travel
Impact on Air Travel

న్యూఢిల్లీ: కరోనా మహమ్మారి కారణంగా 2020 సంవత్సరంలో దాదాపు అన్ని రంగాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. ఏవియేషన్‌, హాస్పిటాలిటీ రంగాలపై అయితే ప్రభావం దారుణంగా పడింది. గత ఏడాది అన్ని రంగాల్లో ఉద్యోగాలు పోయినప్పటికీ, ఏవియే షన్‌, హాస్పిటాలిటీపై అధిక ప్రభావం చూపి, ఎక్కువ ఉద్యోగాలు కోల్పోయింది

ఈ రంగాల్లోనే. పలు దేశాలు ఆంక్షలు ఎత్తివేయడంతో క్రమంగా కార్యకలాపాలు పుంజుకుంటున్నాయి. విమాన సర్వీసులు దాదాపు 50శాతం సీటింగ్‌తో పరిమితస్థాయిలో ఉన్నాయి. కానీ 2020లో తీవ్రంగా దెబ్బతిన్న ఏవియేషన్‌ రంగంపై 2021లోను అప్పుడు కోలుకునే అవకాశాలు లేవని ఏవియేషన్‌ నిపుణులు భావిస్తున్నారు.

ఏవియేషన్‌ కన్సల్టెంట్‌ సెంటర్‌ ఫర్‌ ఆసియా పసిఫిక్‌ ఏవియేషన్‌ విమాన రంగంలో రికవరీ గురించి అంచనాలు వెలువరించింది. 2021లోను డిమాండ్‌ రికవరీ అనిశ్చితిగానే ఉం టుందని పేర్కొంది. ప్రధానంగా అంత ర్జాతీయ ట్రాఫిక్‌కు డిమాండ్‌ అంతవేగంగా ఉండదని అభిప్రాయపడింది. సిఎపిఎ ప్రకారం 2020 ఆర్థిక సంవత్సరంలో ఇంటర్నేషనల్‌ ట్రాఫిక్‌ 35-40శాతం కోలుకోవచ్చు.

2021-22 ఆర్థిక సంవత్సరంలో డొమెస్టిక్‌ ట్రాఫిక్‌ 70శాతం నుంచి 80శాతం కోలుకోవచ్చునని వెల్లడించింది. కరోనా వ్యాప్తికి ముందు డొమెస్టిక్‌ ట్రావెల్‌ సెగ్మెంట్‌ 55శాతం వాటా ఉంది. అయితే ఇది కరోనా పూర్వస్థితికి అప్పుడే చేరుకునే అవకాశాలు తక్కువ అని అభిప్రాయపడింది.

వైరస్‌ అంతం, వ్యాక్సిన్‌ వచ్చే వరకు పూర్తిస్థాయిలో వచ్చే వరకు ఇలాగే ఉండవచ్చునని తెలిపింది. ఏజెన్సీలను ఆధునీకరించవలసిన అవస రాన్ని ఇకపై విస్మరించలేమని కూడా సిఎపిఎ అభిప్రాయ పడింది. పరిశ్రమ మార్కెట్‌ ఆధారితంగా ఉంటుందని తెలిపింది.

ఎయిర్‌ పోర్ట్స్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియాకు దీర్ఘకాలిక వ్యాపార నమూ నా అవసరమని, ఎందు కంటే అతిపెద్ద విమానా శ్రయాలు ప్రైవేటీ కరించ బడతాయని పేర్కొంది.

తాజా కెరీర్‌ సమాచారం కోసం : https://www.vaartha.com/specials/career/