భారత్‌పై స్వేచ్ఛావాణిజ్య ఒప్పంద ప్రభావం!

ఆర్థిక, సామాజిక పురోగతికి తోడ్పాటు

Impact of Trade Agreement on India!
Impact of Trade Agreement on India!

ఇటీవలే ప్రపంచంలోనే అతి పెద్దదైన స్వేచ్ఛావాణిజ్య ఒప్పందం చైనా సహా ఇతర పదిహేను (15)దేశాల మధ్య జరిగిన విషయం మనకు తెలిసిందే.

గత కొన్ని సంవత్స రాలుగా చర్చలు జరుగుతున్న రీజినల్‌ కంప్రీహేన్సీవ్‌ ఎకనామిక్‌ పార్టనర్షిప్‌ (ప్రాంతీయ సమగ్ర ఆర్థిక భాగస్వామ్యం)అనేక కోణాల్లో వివిధ దేశాలు జరిపిన దర్యాప్తులను బట్టి గత నెలలో పదిహేను దేశాలకుపైగా స్వేచ్ఛావాణిజ్య రవాణాలకు ఒప్పందాలు తెలుపుకున్నాయి.

కాని భారతదేశం ఇంకా తన ఒప్పందం మాత్రం తెలుప లేదు. స్వేచ్ఛావాణిజ్యం రవాణాలు జరపడం వలన మనదేశంలో జరిగే పరిణామాలు ఏంటి? అలాంటి ఒప్పందాలు నిజంగా దేశ పురోగతికి తోడ్పడుతాయా?

భారతదేశం ఆర్‌సిఇపిలో భాగస్వామ్యం పొందితే భారత వాణిజ్య నైసర్గికలో మనం చేసే ఎగుమతుల్లో, పొందే దిగుమతుల్లో కలిగే మార్పులు ఎలాంటివి? దీనివలన కార్మి కులకు జరిగే పరిణామం ఎటువంటిది? భారతదేశానికి ఇందులో భాగస్వామ్యం కావడం ఉచిత వాణిజ్యం జరపడం అవసరమా? ప్రస్తుత ఆధునిక ప్రపంచ ధోరణిలో ఇటువంటి అంతర్జాతీయ ఒప్పందాలు భారత్‌ వంటి పురోగమనం చెందుతున్న దేశానికి ఎలా ఉపయోగడపతాయి?

గతంలో భారత్‌జరిపిన స్వేచ్ఛావాణిజ్య రవాణాలు దేశానికి ఎటువంటి సంకేతాలను అందించాయి? స్వేచ్ఛా వాణిజ్య రవాణాలు అసలు అవసరమా అని అంటే నిజానికి అవి నేటి ప్రపంచంలో అవసరమనే చెప్పాలి. ఎందుకంటే ఇటువంటి ఒప్పందాల వలన పురోగతి చెందే అవకాశం ఎక్కువ.

రెండు దేశాల కంటే ఎక్కువ దేశాల మధ్య జరిగే ఈ ఒప్పందంలో రవాణాలపై విధించేరుసుము తగ్గించడానికి మొగ్గుచూపుతారు. ఏకంగా 90శాతం రుసుము 20 సంవత్సరాలలో తగ్గే అవకాశం ఉంది. ఇటువంటివి పురోగమనంలో ఉన్న దేశాలకు వేగంగా పురోగతి చెందడానికి ఎంతోచక్కని అవకాశం.

ఒక ప్రణాళికను రూపొందించుకొని ముందుకు సాగడం వలన తొందరగా దేశాలకు అవి ఉత్పత్తి చేసే వస్తువ్ఞలకు,సేవలకు మంచి గుర్తింపు వచ్చే ఆస్కారం ఉంటుంది.

ఒక మంచి వ్యాపార వాతావరణాన్ని నిర్మిస్తూ ప్రపంచ దేశాల మధ్య చక్కని పోటీతత్వాన్ని ప్రేరేపుతుంది. తద్వారా ఉత్పత్తి అన్నది మెరుగుపడుతూ రానున్న అవసరాలను తీరుస్తుంది.దీనివల్ల వివిధ దేశాలు ఐక్యమవ్ఞతాయి కనుక ప్రపంచ శాంతి స్థాపనలో కూడా పరోక్షంగా నిలుస్తుంది.

ప్రస్తుత కాలంలో ఇటువంటి స్వేచ్ఛావాణిజ్య రవాణాలు భారత్‌కు ఎలా తోడ్పడ తాయి అన్న విషయాలు గమనిస్తే ప్రస్తుత భారత జనాభాలో ఎక్కువ శాతం ప్రజలు నిజానికి నాణ్యమైన వస్తువులకు దూరంగా ఉంటున్నారనే చెప్పాలి. ఎందుకంటే మన దేశంలో లభించే మార్కె ట్స్‌ అంత మంది అవసరాలను తీర్చే అంతపెద్దవి కావు.

నిజానికి కొంతమంది మాత్రమే డబ్బును పోగుచేస్తూ నాణ్యమైన జీవితాన్ని గడుపుతున్నారు.ఇంకోదరికి అవి అందని ద్రాక్షలాగానే ఉండిపోతు న్నాయి.స్థూల దేశీయోత్పత్తిలో 20శాతం మనం చేసే ఎగుమతుల వలన పొందుతున్నాం. ఇలాంటి స్వేచ్ఛావాణిజ్యరవాణాల వలన మనకు మనం చేసే ఎగుమతులపై రుసుం తగ్గడం వలన ఇంకా దానిని పెంపొందించుకునే అవకాశం ఉంటుంది.

ఇంతటి అవకాశం ఉన్నా కూడా భారత్‌ వంటి దేశాలు ప్రస్తుతం స్వేచ్ఛా వాణిజ్యం వంటి ఒప్పందాలకు దూరంగా ఉండటానికి అనేక కారణాలు న్నాయి. గతంలో ఎదురైన చెడు అనుభవాలు, మంచి ఫలితాల్ని మనదేశంలో చూడకపోవడం, సరిగ్గా నెలకొల్పలేకపోవడం ఇలాంటి ఎన్నో సమస్యలవలన దేశం 1990నుండి చేస్తున్న స్వేచ్ఛావాణిజ్య రవాణాలో వెనుకంజలో ఉందని చెప్పవచ్చు.

గతంలో శ్రీలంక, దక్షిణ కొరియా, ఉత్తరకొరియా, జపాన్‌, ఇతర ఆసియా దేశాలతో ఇటువంటి ఒప్పందాలను చేసుకున్నప్పటికీ ఏవీ సత్ఫలితాన్ని ఇవ్వ లేకపోయాయి. అంతేకాకుండా వాణిజ్యపరంగా కూడా మనదేశం ఎంతో నష్టాన్ని చవి చూసింది. అందుకు మనదేశం ఎన్నో పరిణామాలను ఎదుర్కోవాల్సి వచ్చింది.

ప్రస్తుతం కూడా మనం ఆధు నిక ఆలోచనలతో ముందుకు సాగి ఒప్పందం చేసుకున్నప్పటికీ, కూడా భారత్‌కు ముప్పు పొంచి ఉంది. ప్రాంతీయ పరంగా, స్థలాకృతి కారణంగా కొన్ని కొన్ని దేశాలకు కొన్ని అనుకూల అవకాశాలు ఇటువంటి ఒప్పందాల్లో కల్పించడం వలన చైనా వంటి దేశాలు ఎంతో లాభం పొందే అవకాశం ఉంది.

దానికి ప్రతిఫలంగా మనదేశ మార్కెట్లు వివిధ వస్తువ్ఞలతో నిండుతున్నా యి. తద్వారా స్వయం ఉపాధి అన్నది దేశంలో కరవ్ఞగా మారు తుంది.అనేక లాభాలున్నప్పటికీ స్వదేశీ వస్తువుల ఉత్పత్తి ప్రోత్సా హం, స్వయం ఉపాధి ఇవే దేశ ఆర్థిక, సామాజిక పురోగతి చెందడంలో ఎంతో తోడ్పడుతాయి.

వేగంగా ఎదిగి స్వదేశీ కార్మికులకు ముప్పు తీసుకురావడం కన్నా మెల్లిగా ఎదిగి దేశ ప్రజలను ముందుకు తీసుకుపోవడం మంచి ఆలోచన.

  • బండి ఆది

తాజా ఆంధ్రప్రదేశ్‌ వార్తల కోసం: https://www.vaartha.com/andhra-pradesh/