మహారాష్ట్ర, హర్యానా ఫలితాల ప్రభావం

రాజ్యసభలో బిజెపికి తగ్గనున్న సీట్లు

BJP
BJP

న్యూఢిల్లీ: మహారాష్ట్ర, హర్యానా రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో కాంగ్రెస్‌ మెరుగైన ఫలితాలు సాధించింది. బిజెపిలో మాత్రం అసంతృప్తి నెలకొంది. రెండు రాష్ట్రాల్లోను బిజెపి అధినాయకత్వం ప్రభుత్వ ఏర్పాటుకు సిద్ధపడుతోంది. రెండు రాష్ట్రాల్లో అత్యధిక స్థానాలు కొల్లగొట్టి రాజ్యసభ సీట్లను పెంచుకుందామనుకున్న మోడీ, అమిత్‌ షాలకు ఈ ఫలితాలు కొంత నిరాశకు గురి చేశాయనే చెప్పాలి. రెండు రాష్ట్రాల్లో వచ్చిన సీట్ల సంఖ్య రాజ్యసభపై ప్రభావం చూపే అవకాశాలు కనిపిస్తున్నాయి. మధ్యప్రదేశ్‌, చత్తీస్‌గఢ్‌, రాజస్థాన్‌లలో అధికారం కోల్పోయిన బిజెపి రాజ్యసభ సీట్లు మెరుగుపరుచుకునే అవకాశాన్ని కూడా కోల్పోయింది. రెండు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలతో బిజెపికి రాజ్యసభలో సీట్లు తగ్గి కాంగ్రెస్‌కు సీట్లు పెరిగే అవకాశాలున్నాయంటున్నారు. మహారాష్ట్ర నుండి 19 మంది రాజ్యసభకు వెళ్లనుండగా హర్యానా నుంచి అయిదుగురు రాజ్యసభకు వెళతారు. హర్యానాలోని వెళ్లనున్న అయిదుగురిలో కాంగ్రెస్‌ నుంచి ఒకరు కాగా బిజెపి నుంచి ముగ్గురు రాజ్యసభలో ఉన్నారు. మరొకరు ఇండిపెండెంట్‌గా ఉన్నారు. ఇక మహారాష్ట్రలో కాంగ్రెస్‌ – నేషనలిస్టు కాంగ్రెస్‌ పార్టీల నుంచి ఏడుగురు రాజ్యసభకు ప్రాతినిథ్యం వహిస్తున్నారు. ఎన్డీఎ నుంచి 11 మంది రాజ్యసభకు ఎన్నికయ్యారు. హర్యానా నుంచి అయిదుగురు రాజ్యసభ సీట్లకు గాను రెండు సీట్లకు 2020 మరో రెండు సీట్లకు 2022లో ఎన్నికలు జరుగుతాయి.

్ఖతాజా ఆంధ్రప్రదేశ్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి.. https://www.vaartha.com/andhra-pradesh/