సిమెంట్‌ కంపెనీలపై గడ్కరీ వ్యాఖ్యల ప్రభావం

సౌత్‌ ఇండియా సిమెంట్‌ మాన్యుఫాక్షరర్స్‌ అసోసియేషన్‌ ఖండన

Impact of Gadkari's remarks on cement companies
Impact of Gadkari’s remarks on cement companies

Mumbai: కుమ్మక్కు ఆరోపణలపై సిమెంట్‌ మానుఫ్యాక్షరర్స్‌ తీవ్రంగా స్పందించాయి. ఇండియా సిమెంట్స్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ అండ్‌ ఎండి, సౌత్‌ ఇండియా సిమెంట్‌ మాన్యుఫాక్షరర్స్‌ అసోసియేషన్‌ (ఎస్‌ఐసిఎంఎ) ప్రెసిడెంట్‌ ఎన్‌ శ్రీనివాసన్‌ కుమ్మక్కు ఆరోపణలను ఖండించారు.

సిమెంట్‌ ఉత్పత్తి దారులు ఒక్కటే అధిక ధరలకు సిమెంట్‌ విక్రయిస్తున్నారని చెప్పడం సరికాదన్నారు. అసలు ఇక్కడ జట్టు కట్టి ఇష్టారీతిన ధరలు ఎక్కడ పెంచారని ప్రశ్నించారు. బిల్డర్స్‌పైన అసహనం వ్యక్తం చేశారు.

భవన నిర్మాణ వ్యయంలో సిమెంట్‌ పాత్ర స్పల్వమని, బిల్డర్స్‌ 100శాతంపైగా మార్జిన్‌ ఉంచుకొని ఇళ్ల ధరల్ని నిర్ణయిస్తున్నారని, అదీ కాకుండా పెరిగిన ఇళ్ల ధరలకు సిమెంట్‌ కంపెనీలను బాధ్యు లను చేయడం సరికాదన్నారు.

ప్రజలను తప్పుదోవ పట్టించేందుకే బిల్డర్లు ఇలా ఆరోపిస్తున్నారన్నారు. బిల్డర్స్‌ లాబీని అడ్డుకోవడానికి ప్రభుత్వం తగి న చర్యలు తీసుకోవాలని ప్రధాని నరేంద్ర మోడీని లేఖ ద్వారా కోరారు.

ప్రతి బిల్డర్‌ ధర విషయంలో పారదర్శ కంగా ముందుకు రావడంతో పాటుగా ఇళ్లధరల్ని దాదాపు 50శాతం తగ్గించాలని, అదే విధంగా చెక్కు ద్వారా లావాదేవీలు జరపకుంటే తగిన చర్యలు తీసుకోవాలన్నారు. ప్రధాన మోడీ పిలుపునిచ్చిన ఆత్మనిర్భర్‌ భారత్‌ సంపూర్ణలక్ష్యం సాధించిన వాటిలో సిమెంట్‌ రంగం ఒకటి అన్నారు.

500 మిలియన్‌ టన్నుల వార్షిక ఉత్పత్తి సామర్థ్యంతో భారత్‌ రెండో స్థానంలో ఉందని గుర్తుచేశారు. 2.5బిలియన్‌ టన్నులతో చైనా మొదట ఉండగా, అమెరికా 70మిలియన్‌ టన్నులతో మూడో స్థానంలో ఉంది. 500 మిలియన్‌ టన్నుల్లో దక్షీణాది రాష్ట్రాల వాటా 200 మిలియన్‌ టన్నులు. హౌసింగ్‌ రంగంలో వృద్ధి సానుకూలంగా లేకపోవడానికి ప్రధాన కారణం కృత్రిమంగా ప్లాట్స్‌, గృహాలను అధిక ధరలకు విక్రయించడం అన్నారు.

తాజా క్రీడా వార్తల కోసం: https://www.vaartha.com/news/sports/