కరోనా కేసుల ప్రభావం: భారీ నష్టాలతో ప్రారంభం

తీవ్ర ఒత్తిడితో బ్యాంకింగ్ సెక్టార్

Mumbai: దేశవ్యాప్తంగా కరోనా కొత్త కేసుల సంఖ్య ఒక్క రోజులోనే 50 వేలకు పైగా దాటడం, స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్ల సెంటిమెంట్ పై ప్రభావం చూపింది. తొలుత నామమాత్రపు లాభాలతో ప్రారంభమైన సూచీలు, వెంటనే ఇన్వెస్టర్ల నుంచి వచ్చిన అమ్మకాల ఒత్తిడితో భారీ నష్టాల దిశగా సాగుతున్నాయి.

బ్యాంకింగ్ సెక్టార్ తీవ్ర ఒత్తిడితో ఉంది. దాదాపు అన్ని బ్యాంకుల ఈక్విటీ షేర్లూ పడిపోయాయి. సెన్సెక్స్, నిఫ్టీలు పాయింట్లు పడిపోయాయి. సెన్సెక్స్ 464 పాయింట్లు, నిఫ్టీ 131 పాయింట్లు నష్టపోయింది.

తాజా ఆంధ్రప్రదేశ్‌ వార్తల కోసం: https://www.vaartha.com/andhra-pradesh/