ట్రంప్ చేసిన ప్రకటన నిరుత్సాహాప‌రిచింది

అమెరికా సాధించిన విజయాల్లో ఇమ్మిగ్రేష‌న్ తోడ్పాటు ఎంతోగానో ఉంది..

Sundar Pichai
Sundar Pichai

నూయార్క్‌: అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ హెచ్- ‌1బీ వీసాల జారీని ర‌ద్దు చేస్తూ చేసిన ప్రకటనపై గూగుల్, ఆల్ఫాబెట్‌ సంస్థ సీఈవో సుంద‌ర్ పిచాయ్ స్పందించారు. ట్రంప్ తీసుకున్న నిర్ణ‌యం త‌న‌ను నిరుత్సాహాప‌రిచింద‌న్నారు. అమెరికా ఆర్థిక రంగంలో సాధించిన విజయాల్లో ఇమ్మిగ్రేష‌న్ ఎంతోగానో సహకరించిందని చెప్పారు. అందువల్లే అమెరికా సాంకేతికపరంగా గ్లోబ‌ల్ లీడ‌ర్‌గా అవతరించిందని తెలిపారు. గూగుల్ ఇప్పుడు గొప్ప స్థానంలో ఉందంటే అది కూడా ఇమ్మిగ్రేషన్‌ వ‌ల్లేనని చెప్పారు. అయితే ట్రంప్ చేసిన ప్ర‌క‌ట‌న నిరుత్సాహాప‌రిచినా.. తాము మాత్రం ఇమ్మిగ్రాంట్స్‌కు మ‌ద్ద‌తుగా ఉంటామ‌ని, అన్ని ర‌కాలుగా అవ‌కాశాలు క‌ల్పిస్తూనే ఉంటామ‌ని పిచాయ్ త‌న ట్విట్ట‌ర్‌లో తెలిపారు.


తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/national/