వాడుకలో లేని బోరుబావులు తక్షణమే మూసివేయండి

అధికారులను ఆదేశించిన పళనిస్వామి

palani swami
palani swami

చెన్నై: తమిళనాడులో నెలకొన్ని బోరుబావిలో పడి మరణించిన సుజిత్‌ అనే చిన్నారి ఉదంతం ఆ రాష్ట్రాన్నే కాదు దేశాన్నే కదిలించింది. సుజిత్‌ లాంటి చిన్నారులు ఇలాంటి ప్రమాదాలకు బలైపోకుండా ఉపయోగించ ని బోరుబావులను, ట్యూబ్‌ బావులను వెంటనే పూడ్చివేయాలని, పాడుబడిన బోరుబావుల ద్వారాలను మూసివేసే చర్యలు తీసుకోవాలని తమిళాడు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. సుజిత్‌ విషాదం ప్రతి ఒక్కరికి వెంటాడుతోంది. ఇలాంటివి పునారావృతం కాకుండా సరిదిద్దే కార్యక్రమాలను తమిళనాడు రాష్ట్రం చేపట్టింది. ఈ మేరకు తమిళనాడు ముఖ్యమంత్రి పళనిస్వామి రాష్ట్రంలో వాడుకలోనే బోరుబావులను మూసివేయాలని ఆదేశించారు. బాధిత కుటుంబాన్ని పరామర్శించిన సిఎం ప్రభుత్వం తరపున రూ.10 లక్షలు, పార్టీ తరపున మరో రూ.10 లక్షల పరిహారాన్ని అందచేశారు. సుజిత్‌ మరణంపై ప్రభుత్వ యంత్రాంగం విఫలమైందంటూ విమర్శలు వస్తున్న నేపథ్యంలో సిఎం పళనిస్వామి స్పందించారు. 2015లో జారీ చేసిన గెజిట్‌ను సూచిస్తూ జిల్లా కలెక్టర్‌లకు ఆదేశాలు జారీ చేశారు. బోరుబావుల విషయంలో అధికారులు నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తీసుకొంటామని సిఎం హెచ్చరించారు. ఈ విషయంలో అధికారులు, ప్రభుత్వ యంత్రాంగం వేగంగా చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేశారు.
తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి.. https://www.vaartha.com/telangana/