7 రాష్ట్రాలకు రెడ్‌ అలర్ట్‌ ప్రకటించిన వాతావరణశాఖ

గత కొద్దీ రోజులుగా ఉత్తర భారత దేశాన్నిభారీ వర్షాలు , వరదలు ముంచెత్తుతున్నాయి. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల వల్ల లోతట్టు ప్రాంతాలన్ని కూడా జలమయం అవుతున్నాయి. ఎక్కడికక్కడ రోడ్లు తెగిపోయి రవాణా నిలిచిపోయాయి. ఈ పరిస్థితి మరికొన్ని రోజులు కొనసాగే అవకాశాలున్నాయని భారత వాతావరణశాఖ వెల్లడించింది.

ఈ క్రమంలోనే వర్షపాతం అధికంగా నమోదయ్యే అవకాశాలున్న ఏడు రాష్ట్రాల్లో రెడ్ అలర్ట్‌ ను జారీ చేసింది. గుజరాత్‌, అస్సాం, మేఘాలయా, అరుణాచల్‌ ప్రదేశ్‌, త్రిపుర, పశ్చిమ బెంగాల్‌, సిక్కిం రాష్ట్రాల్లో ఈ నెల 4 వరకు హెచ్చరికలు అమల్లో ఉంటాయని స్పష్టం చేసింది. అలాగే తమిళనాడు, బీహార్‌, రాజస్థాన్‌, యూపీ, ఉత్తరాఖండ్‌, హిమాచల్‌ ప్రదేశ్‌, హరియాణా, మహారాష్ట్ర, గోవా వంటి రాష్ట్రాల్లో ఆరెంజ్‌ హెచ్చరికలను ఐఎండీ జారీ చేసింది. మరో నాలుగు రోజులు ఇదే పరిస్థితి కొనసాగుతుందని ఐఎండీ తెలిపింది.