రాజ్యసభకు దక్షిణాది ప్ర‌ముఖులు..

రాష్ట్ర‌ప‌తి కోటాలో రాజ్య‌స‌భ‌కు న‌లుగురిని కేంద్ర ప్ర‌భుత్వం నామినేట్ చేసింది. ఈ న‌లుగురు కూడా ద‌క్షిణాదికి చెందిన వారే కావ‌డం విశేషం. వీరిలో దర్శక ధీరుడు రాజమౌళి తండ్రి విజేంద్రప్రసాద్ కాగా, సంగీత దర్శకులు ఇళ‌య‌రాజా(త‌మిళ‌నాడు), పరుగుల రాణి పీటీ ఉష‌(కేర‌ళ‌), వీరేంద్ర హెగ్డే(క‌ర్ణాట‌క‌)లను రాజ్య‌స‌భ‌కు నామినేట్ చేస్తున్న‌ట్లు ప్ర‌ధాని న‌రేంద్ర మోడీ ట్విట్ట‌ర్ వేదిక‌గా ప్ర‌క‌టించారు.

‘శ్రీ వి.విజయేంద్ర ప్రసాద్ గారు దశాబ్దాలుగా సృజనాత్మక ప్రపంచంతో అనుబంధం కలిగి ఉన్నారు. అతని రచనలు భారతదేశం యొక్క అద్భుతమైన సంస్కృతిని ప్రదర్శిస్తాయి మరియు ప్రపంచవ్యాప్తంగా ఒక ముద్ర వేసాయి. రాజ్యసభకు నామినేట్ అయినందుకు ఆయనకు అభినందనలు’ అంటూ మోదీ తన ట్వీట్‌లో పేర్కొన్నారు. గత దశాబ్దాలుగా కళా రంగానికి ఎంతో సేవ చేస్తున్నారు శ్రీ విజయేంద్ర ప్రసాద్ గారు.. భారత సంస్కృతి సంప్రదాయాలు ప్రతిబింబించేలా ఆయన పని తనం ఉంటుంది.. ఆయన తన పనితనంతో ప్రపంచ వ్యాప్తంగా మన కీర్తిని వ్యాపింపజేశారు. రాజ్యసభకు నామినేట్ అయినందుకు ఆయనకు కంగ్రాట్స్ అని ప్రధాని నరేంద్ర మోడీ ట్వీట్ చేసారు.

క్రియేటివ్ జీనియస్ ఇళయరాజా గారు ఎన్నో తరాలను అలరిస్తూ వస్తున్నారు.. ఎన్నో భావాలను ఆయన తన సంగీతంతో పలికించారు.. ఆయన కింది స్థాయి నుంచి వచ్చి.. ఎంతో ఎత్తుకు ఎదిగారు.. ఆయన జీవిత ప్రయాణం ఎంతో మందికి స్పూర్తి.. ఆయనలాంటి వ్యక్తి రాజ్యసభకు నామినేట్ అయినందుకు ఎంతో సంతోషంగా ఉంది అని ప్రధాని నరేంద్ర మోడీ ట్వీట్ చేసారు.