ఇగ్నోయూ దరఖాస్తులకు గడువు పొడిగింపు

వర్శిటీ అధికారుల వెల్లడి

IGNOU Applications-Deadline Extension
IGNOU Applications-Deadline Extension

New Delhi: ఇందిరా గాంధీ నేషనల్ ఓపెన్ యూనివర్సిటీ (ఇగ్నోయూ ) ఓపెన్ అండ్ డిస్టెన్స్ మోడ్ లో 2022 విద్యాసంవత్సరానికి జనవరి సెషన్‌ ప్రవేశాల కోసం ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరి తేదీని ఫిబ్రవరి 10 వరకు పొడిగించింది. ఇప్పటివరకు ఇంకా దరఖాస్తు చేసుకోని విద్యార్థులు ఎవరైనా ఉంటే అధికారిక వెబ్‌సైట్‌ https://www.ignouadmission.samarth.edu.in లో దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపింది. దరఖాస్తు చేసుకునే సమయంలో న్యూ రిజిస్ట్రేషన్‌ను క్రియేట్‌ చేసుకుని, అవసరమైన అన్ని వివరాలను సమర్పించాలి. అలాగే ఏ కోర్సులో అడ్మిషన్‌ తీసుకోవాలనుకుంటున్నారో ఆ కేటగిరీని కూడా ఎంచుకోవాల్సి ఉంటుంది.

వాణిజ్యం (బిజినెస్) వార్తల కోసం : https://www.vaartha.com/news/business/