రైతు బీమా కావాలంటే కేసీఆర్కు ఓటేయాలి: మంత్రి జగదీశ్ రెడ్డి

If you want farmer insurance, you should vote for kcr says minister jagadish reddy

హైదరాబాద్: మునుగోడు ప్రచారంలో మంత్రి జగదీశ్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. రాజగోపాల్ గెలిస్తే టీఆర్ఎస్ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు ఆగిపోతాయని అన్నారు. మునుగోడు టీఆర్ఎస్ అభ్యర్థి కూసుకుంట్లకు మద్దతుగా మల్కాపూర్ లో ప్రచారం నిర్వహించిన జగదీశ్ రెడ్డి.. రైతు బీమా కావాలంటే కేసీఆర్కు ఓటేయాలని అన్నారు. ఓటు వేసేటప్పుడు ప్రజలు ఆలోచించి నిర్ణయం తీసుకోవాలని, ఎవరికి ఓటేస్తే మంచి జరుగుతుందో తేల్చుకోవాలని సూచించారు.

సీఎం కేసీఆర్ రాష్ట్రంలో 24 గంటల కరెంట్ ఇస్తుంటే గుజరాత్లో కేవలం 6 గంటల కరెంట్ ఇస్తున్నారని మంత్రి జగదీష్ రెడ్డి విమర్శించారు. రైతుల మోటర్లకి మీటర్ పెడితే తప్పు ఏముందని బీజేపీ అభ్యర్థి రాజగోపాల్ రెడ్డి చెబుతున్నారని..ఒకవేళ రాజగోపాల్ రెడ్డిని గెలిపిస్తే టీఆర్ఎస్ ద్వారా వచ్చే పథకాలన్నీ ఆగిపోతాయని అన్నా