సహాయం కోరితే చేస్తా… రఘురాం రాజన్‌

ఇతర దేశాలతో పోలిస్తే భారత మారక విలువలు స్థిరంగా ఉన్నాయి

raghu ram rajan
raghu ram rajan

దిల్లీ: ప్రస్తుత పరిస్థితుల్లో ఆర్ధిక వ్యవస్ధ ఎదుర్కోంటున్న ఒత్తిడిని అధిగమించేందుకు తన సహయం కోరితే చేయడానికి తాను ఎప్పుుడు సిద్దంగా ఉంటానని ఆర్బిఐ మాజీ గవర్నర్‌ రఘురాం రాజన్‌ ఓ ఆంగ్ల పత్రికకు ఇంటర్వ్యూలో వెల్లడించారు. కోవిడ్‌-19 కారణంగా ప్రపంచం మొత్తం ఆర్ధిక మాంద్యంలోకి వెలుతుంది. వచ్చే ఏడాది దీని నుంచి కోలుకుంటామని భావిద్దాం. కాని అది మనం తీసుకునే చర్యలమీదే ఆధారపడి ఉంటుంది. ఈసమయంలో ఇతర దేశాలతో పోలిస్తే భారత మారక విలువలు స్థిరంగా ఉన్నాయి. దానికి ఆర్‌బిఐ ఇచ్చే సహాకారం కూడా కారణం కావొచ్చు. ఈ సమయంలో తన సహయం కోరితే చేయడానికి సిద్దంగా ఉన్నానని ఆయన అన్నారు.

తాజా ఏపి వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/andhra-pradesh/