ఈర్ష్వ హద్దు మీరితే జీవితం నాశనమే..

జీవన వికాసం

If you are jealous, life is ruin
If you are jealous, life is ruin


ఈర్ష్య మనిషి పతనానికి ఇది నాంది. ఎవరైనా, ఏదైనా బాగా ఉంటే చాలు ఈర్ష్య బయటకు వచ్చేస్తుంది.అది కుదురుగా కూర్చొనివ్వదు. పని చేసుకోనివ్వదు అంతా డిస్ట్రబ్‌.

అంతులేని ప్రేమలో అంతుచిక్కకుండా దాగి ఉంటుంది. ఈర్ష్య.. మనిషి పతనానికి ఇది నాంది. ఎవరైనా,ఏదైనా బాగా ఉంటే చాలా ఈర్ష్య బయటకు వచ్చేస్తుంది. అది కుదురుగా కూర్చొనివ్వదు.

పని చేసుకోనివ్వదు అంతా డిస్ట్రబ్‌. అంతులేని ప్రేమలో అంతు చిక్కకుండా దాగి ఉంటుంది. ఈర్ష్య. ఇది లేనివారు ప్రపంచంలో చాలా అరుదు.

మనిషిలోనూ ఏదో ఒక మూల ఎంతో కొంత మోతాదులో నక్కి ఉంటుంది. మనిషి ఇంతలా విచ్చనం చేస్తున్న ఈర్షను తగ్గిచడం ఎలా. దాన్నుంచి బయటపడి ప్రేమ ముందుకు సాగాడానికి నిపుణులు.సలహాల ఎంటో తెలుసుకుందాం..

మనిషి జీవితంలో జరిగిన చేదు అనుభవాలు, మదురానుభూతులు రెండు ఉంటాయి. వీటిని ఒసారి తులన్మాతకంగా విశ్లేషించుకోవాలి. జీవితం మలుపుల్లో అన్ని చేదు అనుభవాలు ఉండవు కొంతైనా మంచి సంఘటనలు ఉంటాయి.

ఏదైనా మనం చూసే దృష్టిని బట్టే ఉంటుంది. ఓటములనే నెమరు వేసుకుంటే మనలో ప్రతికూల భావాలు. గురించే ఆలోచిస్తాము. సానుకుల థృక్పతాన్ని అలవరచు కున్నప్పుడు మనోని ప్రతికూల భావాల్ని కొంత వరకు బ్యాలెన్స్‌ చేస్తాయి. ఇతరుల అలవాట్లను చూసినప్పుడు, వారి భావాలను విన్నప్పుడు ఈర్ష్యపడుతోంది.

అలాంటి వన సమంజనమేనా అని కాస్త ఆలోచించాలి. ఆ ఆలోచనే మీలో మార్పునకు మొదటి మెట్టు. మనతో సాధ్యపడానిది ఇతరు లకు సాధ్యమైనప్పుడు ఎదుటి వారిపట్ల ఈర్ష్య కలుగుతుంది. ఈ విషయాన్ని ఓసారి సరిగ్గా విశ్లేషిం చుకోవాలి.

వాళ్ల దగ్గర ఉన్నది మీ దగ్గర లేదని.. ఒకరికి కలిగిన మదురానుభూతి మీకు కలగలేదనో మీరు అభద్రత భావానికి లోను కాకుండా మీ జీవితంలో మీరు ఓ మంచి అనుభవాలు ఉంటాయనే విషయం అర్థం చేసుకోండి.

వారు ఆ సమయంలో సంతోషంగా కనిపించవచ్చు కానీ అంతకు ముందు వారు ఓ చేదు అనుభవాన్ని ఎదుర్కోన్నారనే విషయాన్ని అర్థం చేసుకోండి. మీ దృష్టి కోణం నాణేనికి ఓ వైపు ఉందనే విషయాన్ని గమనించండి. రెండోవైపు కూడా గుర్తించడానికి ప్రయత్నించండి.

ప్రతికూలతలను అనుకూలంగా మార్చకునేవారు జీవితంలో విజయం సాధించడం లో సఫలం అవుతారు. ఎవరిమీదైనా మనకు ఈర్ష్య ఇప్పటికే ఏర్పడిపోయిం దేమో మనలోకి మనమే తరచి చూసుకోవాలి. ఉంటే అనుమానం లేకుండా ఈర్ష్యకు లోనయ్యామనే విషయాన్ని ఒప్పుకోవాలి.

దీంతో మీలోపాన్ని మీరు గుర్తించినట్లు అవుతుంది. అప్పుడే దీన్నుంచి త్వరగా బయటపడేం దుకు అవకాశం ఉంటుంది.

ప్రపచంలో ఎవరూ ఎవరి అధీనంలోనూ ఉండరని గ్రహించాలి. అది కుటుంబ సభ్యులైన సరే ఎవరి వ్యక్తిత్వం వారికి ఉంటుందని ముందుగా గుర్తించాలి.

ఆలోచనే కాదు. ప్రయత్నం కూడా ముఖ్యం. ఇక మీలో ఉన్న ఈర్ష్యను పక్కకు పెట్టి మారడానికి ప్రయత్నించండి.

తాజా ‘నిఘా’ వార్తల కోసం : https://www.vaartha.com/specials/health/