రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే బిజెపి, జనసేనతోనే సాధ్యం

రెండూ పార్టీలు 2024లో అధికారమే లక్ష్యంగా ప్రజా వ్యతిరేక నిర్ణయాలపై కలిసి పోరాటం చేస్తాం

Kanna Lakshminarayana
Kanna Lakshminarayana

అమరావతి: విజయవాడలోని మురళి ఫార్చ్యూన్‌ హోటల్‌లో బిజెపి, జనసేన మధ్య ఈ రోజు కీలక భేటీ జరిగింది. ఈ భేటీ అనంతరం ఏపీ బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారయణ మాట్లాడారు. విభజన తర్వాత ఈ రాష్ట్రం అభివృద్ధి చెందలన్నా, సామాజిక న్యాయం సాధించాలన్నా బిజెపి-జనసేనతోనే సాధ్యమన్నారు. రెండు పార్టీలూ 2024లో అధికారమే లక్ష్యంగా ప్రజా వ్యతిరేక నిర్ణయాలపై కలిసి పోరాటం చేస్తామన్నారు. రాష్ట్ర ప్రభుత్వ నియంతృత్వ ధోరణి, గతంలో ఉన్న టిడిపి ప్రభుత్వ అవినీతిపైనా కలిసి పోరాడాలని నిర్ణయించమన్నారు. దేశ, రాష్ట్ర భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని తమతో కలిసి పనిచేయడానికి పవన్‌ కళ్యాణ్‌ ముందుకొచ్చారని, ఎలాంటి షరతుల్లేకుండా తమతో కలిసి పనిచేయడాకి పెద్దమనసుతో పవన్‌ కళ్యాణ్‌ ముందుకొచ్చినందుకు పవన్‌ను ఆహ్వానిస్తూ ధన్యవాదాలు తెలియజేస్తుమన్నారు. ప్రధాని నరేంద్ర మోడీ సారథ్యంలో అవినీతి రహిత అభివృద్ధి లక్ష్యంగా తమ రెండు పార్టీలు కలిశాయని కన్నా లక్ష్మీనారయణ తెలిపారు.

తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/national/