బయటకొచ్చింది ఉల్లిపాయపై పొర మాత్రమే!
పీఎస్ ఇళ్లను సోదా చేస్తేనే వేల కోట్ల బ్లాక్ మనీ బయటపడింది

అమరావతి: టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు పీఎస్ ఇళ్లను సోదాలు చేస్తేనే వేల కోట్ల బ్లాక్ మనీ బయటపడిందని వైఎస్సార్సిపి ఎంపీ విజయసాయిరెడ్డి ట్విట్టర్ వేదికగా విమర్శించారు. ఇంకా చంద్రబాబు బినామీలు, పెంచి పోషించిన కాంట్రాక్టు సంస్థలను జల్లెడ పడితే రూ.10 లక్షల కోట్లయినా దొరుకుతాయని తెలిపారు. చంద్రబాబు నెట్ వర్క్‌ను చూసి ముంబయి కార్పోరేట్ సంస్థలన్నీ బిత్తర పోయాయట అని ఎద్దేవా చేశారు. ఇప్పుడు బయటకొచ్చింది ఉల్లిపాయపై పొర మాత్రమేనని అన్నారు. ఇంకా చంద్రబాబు నాయుడు మహాత్మాగాంధీ లాంటి వ్యక్తినని కటింగులిచ్చాడు. నిప్పుకణికలు నన్ను చూసి ఈర్షపడతాయని గొప్పలకు పోయాడు. అక్రమ సంపాదనను వ్యవస్థీకృతం చేసి 14 ఏళ్ల పాటు విచ్చలవిడిగా దోచుకున్నాడని దుయ్యబట్టారు. వ్యవస్థన్నింటిని మ్యానేజ్ చేసి తప్పించుకుంటూ వచ్చారు. కాలం ఎప్పుడూ ఒకేలా ఉండదని గ్రహించలేకపోయాడని విజయసాయిరెడ్డి ట్వీట్ చేశారు.
తాజా జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/news/national/