పరిమళాలు వెదజల్లాలంటే

పరిమళాలు  వెదజల్లాలంటే
If the fragrances dissipate

ఎంతో ఖరీదైన ఫ్రాగ్రెన్స్‌లు కొంటాం. కానీ కొన్నప్పుడు ఉన్నంత నాణ్యత తర్వాత లోపించింది అనిపిస్తుంది. అలా అనిపించడానికి కారణం పరిమళంలో కాదు. మనలోనే ఉంది. ఫ్రాగ్రెన్స్‌ నాణ్యత చెక్కుచెదరకుండా ఉండాలంటే తేమ లేదా వేడి ఎక్కువగా ఉండే ప్రదేశాల్లో దాచకూడదు. ఎందుకంటే వెలుతురు, వేడి, తేమ.. పరిమళం ప్రభావాన్ని తగ్గిస్తాయి. కాబట్టి చల్లగా, పొడిగా ఉండే పడగ్గదిలోని వ్యానిటీ, కిటికీలకు దూరంగా భద్రపరచాలి. తేలికగా కనిపించడం కోసం సెంటు బాటిళ్ల అమరికకు కేక్‌ స్టాండ్‌ వాడాలి. ఎక్కువ సమయం సువాసన నిలిచి ఉండాలంటే పల్స్‌ పాయింట్‌ మీద సెంటు పుసుకోవాలనే విషయం తెలిసిందే. అయితే అలా పూసుకునే ముందు ఆ ప్రదేశంలో వేజలిన్‌ రాసుకుంటే సువాసన ఎక్కువ సమయం చర్మానికి పట్టి ఉంటుంది. నూనె చర్మం సువాసనలను ఎక్కువ సమయం పాటు నిలిపే ఉంచుతుంది. ఒకవేళ మీది పొడిచర్మమైతే ముందుగా మాయిశ్చరైజర్‌ అప్లై చేసి తర్వాత సెంటు రాసుకోవాలి. స్నానం చేసిన వెంటనే సెంటు రాసుకోవాలి. ఇలా చేస్తే తడిపొడి చర్మం మీద సెంటు ఇంకిపోయి ఎక్కువ సమయం పాటు గుబాళిస్తుంది.

తాజా అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/news/international-news/