తెలంగాణ వస్తే ఆత్మహత్యలు ఉండవని కెసిఆర్‌ చెప్పారు

V. Hanumantha Rao
V. Hanumantha Rao

హైదరాబాద్‌: ముఖ్యమంత్రి కెసిఆర్‌ తెలంగాణ వస్తే ఆత్మహత్యలు ఉండవని ఉద్యమ సమయంలో చెప్పారు. కాని ఇపుడు ఆయన పాలనలో ప్రస్తుత పరిస్థితులు మాత్రం అందుకు పూర్తి భిన్నంగా ఉన్నాయని ఆత్మహత్యలు పెరిగాయని కాంగ్రెస్‌ సీనియర్‌ నేత వి. హనుమంతరావు విమర్శించారు. ప్రభుత్వ తీరుతో రాష్ట్రంలో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు. టిఆర్‌ఎస్‌ పాలనలో రాష్ట్రంలోని రైతులకు న్యాయం జరగట్లేదని రోజు రోజుకు రెవెన్యూ సమస్యలు తీవ్రతరం అవుతున్నాయని అన్నారు. రైతులకు హక్కులు ఉన్నా పట్టాలు రావట్లేదని ఆరోపించారు. ఇంకా ఆర్టీసి కార్మికులు చేపట్టిన చలో ట్యాంక్‌ బండ్‌ కార్యక్రమానికి ప్రభుత్వం, పోలీసులు ఎన్ని అడ్డంకులు సృష్టించిన విజయవంతమైందని చెప్పారు. ఈ నేపథ్యంలో హనుమంతరావు మాట్లడుతూ..సమ్మెను చర్చల ద్వారా పరిష్కారించుకోవాలని హైకోర్టు చెప్పిన కెసిఆర్‌ మొండి ధోరణి మారటం లేదని విమర్శించారు.
తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/national/