‘రాహుల్‌ని ప్రధానిని చేయడం నా బాధ్యత’

HD devegowda
HD devegowda, jds president


బెంగళూరు: బిజెపి అగ్రనేత ఎల్‌కే అద్వానీలా తాను ప్రత్యక్ష రాజకీయాల నుంచి తప్పుకునేది లేదని, రాహుల్‌ ప్రధాని కావడానికి తన శాయశక్తులా కృషి చేస్తానని జెడిఎస్‌ అధినేత, మాజీ ప్రధాని దేవెగౌడ అన్నారు. గతంలో తాను పోటీ చేయనని అని చెప్పానని కాని ప్రస్తుత పరిస్థితులు మారిపోయాయి అందుకే పోటీ చేయక తప్పడంలేదని అన్నారు. పదవులు అనుభవించాలనే ఆశ, ప్రధాని కావాలనే కోరిక తనకు ఎప్పుడూ లేదని, అద్వానీలా తాను రాజకీయాల నుంచి తప్పుకునే ప్రసక్తే లేదని తేల్చిచెప్పారు. పార్టీని కాపాడుకోవడం, ప్రజలకు సేవ చేయడమే తన లక్ష్యమని అన్నారు. తనది చిన్న పార్టీయే అయినా తాను ప్రధాని కావడానికి సోనియా గాంధీ సహకరించారు. ఇప్పుడు రాహుల్‌ ప్రధానిని చేయడం తన భాధ్యతగా భావిస్తున్నట్లు దేవెగౌడ అన్నారు.
ఈసారి తుముకూరు లోక్‌సభ స్థానం నుంచి పోటీకి దిగుతున్నట్లు సమాచారం. ఈ ఎన్నికల్లో కూడా కాంగ్రెస్‌-జేడిఎస్‌లు కలిసే పోటీ చేస్తున్నాయి.

తాజా ఆంధ్రప్రదేశ్‌ ఎన్నికల వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/election-news-2019/andhra-pradesh-election-news-2019/