రైతుల పింఛనుపైనే సియంగా తొలి సంతకం!

pawan kalyan
pawan kalyan

ప్రకాశం: ప్రకాశం జిల్లాలోని గిద్దలూరులో పవన్‌ కళ్యాణ్‌ బుధవారం ఎన్నికల ప్రచారం నిర్వహించారు. తాను ముఖ్యమంత్రిని ఐతే వెంటనే తొలి సంతకం రైతుల పింఛనుపైనే పెడతానని జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్‌ అన్నారు. ఈ సందర్భంగా ప్రసంగించిన ఆయన ప్రజలపై హామీల వర్షం కురిపించారు. కేజీ నుంచి పిజి వరకు ఉచిత విద్య అందిస్తామని ప్రకటించారు. మహిళలకు ఉచిత గ్యాస్‌ సిలెండర్‌ ఇస్తానని హామీ ఇచ్చారు. ప్రకాశం జిల్లా కిడ్నీ వ్యాధిగ్రస్తుల కోసం రూ. 500 కోట్లు కేటాయిస్తామన్నారు. వెలుగొండ ప్రాజెక్టును 18 నెలల్లో పూర్తి చేస్తామన్నారు.