గాంధీ ఆసుపత్రిలో చికిత్స చేయించుకుంటా

కరోనా వస్తే కార్పొరేట్ ఆసుపత్రులకు వెళ్లను

talasani srinivasa yadav
talasani srinivasa yadav

హైదరాబాద్‌: కరోనా కట్టడి కోసం తెలంగాణ ప్రభుత్వం కట్టుదిట్టమైన చర్యలను తీసుకుంటోందని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ చెప్పారు. తనకు కరోనా వస్తే కార్పొరేట్ ఆసుపత్రికి వెళ్లనని, గాంధీ ఆసుపత్రికే వెళ్తానని ఆయన తెలిపారు. తాను ప్రాతినిథ్యం వహిస్తున్న సనత్ నగర్ నియోజకవర్గంలో రూ. 700 కోట్లకు పైగా నిధులతో పలు అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టామని చెప్పారు. గతంలో ఈ నియోజకవర్గానికి మాజీ ముఖ్యమంత్రి చెన్నారెడ్డి ప్రాతినిథ్యం వహించారని… అప్పట్లో కూడా ఈ స్థాయిలో పనులు జరగలేదని తెలిపారు. రూ. 68 కోట్లతో చేపట్టిన 4 లేన్ల రైల్వే అండర్ బ్రిడ్జి, రూ. 45 కోట్లతో నిర్మిస్తున్న ఫతేనగర్ ఓవర్ బ్రిడ్జి పూర్తైతే… ఈ పరిసర ప్రాంతాల స్వరూపమే మారిపోతుందని తలసాని చెప్పారు. కమ్యూనిటీ హాల్స్, బస్తీ దవాఖానలు, మోడల్ మార్కెట్లు, వైట్ ట్యాపింగ్ రోడ్లు, డ్రైనేజీలు, తదితర కార్యక్రమాలను చేపట్టామని తెలిపారు.


తాజా అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/international-news/