భారత్‌లో 5జి సేవలకు 30బిలియన్‌ డాలర్లు!


యుబిఎస్‌ సర్వే వెల్లడి

5G
5G


ముంబయి: భారత్‌ టెలికాం కంపెనీలు 5జిని ప్రారంభించాలంటే 30.5 బిలియన్‌ డాలర్ల వ్యయం భరించాల్సి ఉంటుంది. ఎయిర్‌టెల్‌, రిలయన్స్‌జియో, వొడాఫోన్‌ ఐడియా కంపెనీలు మూడు కలిపి 30.5బిలియన్‌ డాలర్లు వెచ్చించాల్సి ఉంటుందని అంతర్జాతీయ టెలికాం ఆర్ధిక సర్వేలు వెల్లడిస్తున్నాయి. యుబిఎస్‌ బ్యాంకు నిర్వహించిన పరిశోధన విశ్లేషణల్లో ఐదోతరం మొబైల్‌ టెక్నాలజీ మరింత నైపుణ్యంతోను, మరింత వేగంగా డేటా బదలాయింపునకు సంబంధించి వేగవంతమైన కార్యాచరణ వీలవుతుందని, కస్టమర్లకు భారతీయ టెలికాం రంగం వచ్చే ఏడాదినుంచి ప్రారంభించాలన్న లక్ష్యంతో ఉందని యుబిఎస్‌ వెల్లడించింది. భారత్‌లోని మిలియన్లకొద్దీ మొబైల్‌ చందాదారులకు 5జి వస్తే ఎంతో ఉపయుక్తంగా ఉంటుందని వైర్‌లెస్‌ నెట్‌వర్కులన్ని కూడా వైర్‌లైన్‌ బ్రాడ్‌బ్యాండ్‌నెట్‌వర్స్‌ మరింతగా ఆఫర్‌చేసేందుకు వీలువుతుందని, అపరిమిత బాడ్‌విడ్త్‌తో నిరంతరాయంగా సేవలందిస్తుందని వెల్లడించింది. సాంప్రదాయబద్ధంగా వైర్‌లెస్‌ టెక్నాలజీలు 2జి, 3జి నెట్‌వర్క్‌లు షేర్‌ నెట్‌వర్క్‌ విధానంలో వస్తున్నాయి.

స్పెక్ట్రమ్‌లో అప్పుడప్పుడూ సేవలు విఫలం డేటా వేగానికి అంతరాయం కలుగుతున్నది. ఇక ఫిక్సెడ్‌లైన్‌ వాతావరణంలో సేవల నాణ్యత వినియోగదారులు పెరిగే కొద్దీ మరింత తగ్గుతుంది. ఇందుకు సంబంధించి కొన్ని కేబుల్‌ వైర్‌ కంపెనీలు చందాదారుల ఇంటివద్దకు లైన్లువేసి అందిస్తాయి. అదే ఇపుడు 5జి వచ్చినపక్షంలో మొత్తం డేటా వాతావరణమే మారిపోతుంది. అపరిమిత వేగంతో డేటా అందుతుంది. భారతి ఎయిర్‌టెల్‌ రెండుబిలియన్‌ డాలర్లు సాలీనా ఖర్చుచేయాల్సి ఉంటుంది. భారత్‌లో కంపనీ వార్షిక వ్యయంలో 65శాతం వాటా ఖర్చుచేయాల్సి ఉంటుంది. భారతి తన భారత్‌వాటాను కాపాడుకుంటూనే వస్తోంది. జియో 4జి నెట్‌వర్క్‌పై గట్టిపోటీ ఇస్తున్నప్పటికీ 4జి చందాదారులను పెంచుకోగలుగుతున్నది.
తాజా బిజినెస్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి..https://www.vaartha.com/news/business/