సుజనా చౌదరికి బ్యాంక్‌ నోటీసులు

sujana chowdary
sujana chowdary

అమరావతి: ఏపి బిజెపి ఎంపి సుజనా చౌదరికి డిఆర్‌టీ (డిబెట్‌ రికవరీ ట్రిబ్యునల్‌) షాకిచ్చింది. ఎంపి సుజనా చౌదరి, తనకు సంబంధించిన కంపెనీలకు డిఆర్‌టీ నోటీసులు జారీ చేసింది. ఐడిబిఐ బ్యాంకు రూ. 169 కోట్లు ఎగ్గొట్టారంటూ చెన్నై డిఆర్‌టీకి ఫిర్యాదు చేయగా, స్పందించిన డిఆర్‌టీ నోటీసులు పంపింది. ఇందులో సుజనా చౌదరి భార్య పద్మజ, ధనలక్ష్మి, సుజనా క్యాపిటల్‌ సర్వీసెస్‌, ఎస్టీ ప్రసాద్‌, ఎక్స్‌ప్లేయర్‌ ఎలక్ట్రికల్స్‌ నోటీసులు అందాయి. 16వ తేదీన జరిగే విచారణకు సుజనా హాజరు కావాలని, లేదంటే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని డిఆర్‌టీ నోటీసుల్లో పేర్కొంది.

తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/national/