కరోనా కొత్త కిట్ కు ఐసీఎంఆర్ అనుమతి

ఇంట్లోనే కోవిడ్ నిర్ధారణ పరీక్షలు చేసుకోవచ్చు..

coviself kit
coviself kit

‘కోవి సెల్ఫ్’ అనే హోమ్ ర్యాపిడ్ యాంటిజన్ టెస్టింగ్ కిట్ కు ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ఐసీఎంఆర్) అనుమతి ఇచ్చింది. దీంతో మన ఇంట్లోనే కోవిడ్ నిర్ధారణ పరీక్షలు చేసుకోవచ్చు. పూణె లోని మైల్యాబ్ డిస్కవరీ సొల్యూషన్స్ రూపొందించింది. కేవలం కోవిడ్ లక్షణాలు ఉన్నవారు మాత్రమే వాడాలని ఐసీఎంఆర్ సూచించింది. అంతేకాకుండా కోవిడ్ పాజిటివ్ వచ్చిన వారి ప్రథమ కాంటాక్ట్స్ కూడా ఉపయోగించవచ్చని తెలిపింది.

ఎలా ఉపయోగించాలి…?

కిట్ ఓపెన్ చేసి మాన్యువల్ లో చెప్పిన విధంగా టెస్ట్ చేసుకోవాలి. అందులోని స్ట్రిప్ ను ఫోటో తీసి ఆ కిట్ లో చెప్పిన యాప్ ను ప్లే స్టోర్ నుండి డౌన్ లోడ్చేసుకోవాలి. అందులో మన స్ట్రిప్ ఫోటోను పెట్టాలి. అందులో పాజిటివ్ అని వచ్చేవారిని ఆరోజు కేంద్ర ప్రభుత్వ కరోనా పాజిటివ్ కేసులు జాబితాలోకి చేరుతుంది. మన సమాచారం గోప్యంగా ఉంచుతారు. ఇది ఇప్పటికిపుడే అందుబాటులోకి రాకపోవచ్చు, కొద్ది రోజుల తర్వాత ఈ కిట్ అందుబాటులోకి రానుంది.

తాజా ఆంధ్రప్రదేశ్‌ వార్తల కోసం:https://www.vaartha.com/andhra-pradesh/