ఐసిఐసిఐ ఫ్రుడెన్షియల్‌, యుబి పైపైకి

ICICI BANK
ICICI BANK

ముంబై : పబ్లిక్‌కు కనీస వాటా నిబంధనలకు అనుగుణంగా ప్రమోటర్లు 53.26మిలియన్‌ ఈక్విటీ షేర్లను విక్రయించనున్నట్లు ఐసిఐసిఐ ఫ్రుడెన్షియల్‌ తాజాగా తెలిపింది. ఆఫర్‌కు భారీ స్పందన లభించినట్లు తెలియచేసింది. దాదాపు 4 రెట్లు అధికంగా 21 కోట్ల షేర్ల కోసం బిడ్స్‌ దాఖలైనట్లు పేర్కొంది. ఇందుకు ఫ్లోర్‌ ధర రూ.316కాగా, తద్వారా రూ.1683 కోట్లు సమకూర్చుకున్నట్లు తెలుస్తోంది. దీంతో ఈ షేరు ప్రస్తుతం ఎన్‌ఎస్‌ఇలో 9 శాతం పెరిగి రూ.349వద్ద ట్రేడవుతోంది. యునైటెడ్‌ బ్రూవరీస్‌ కూడా విదేశీ ప్రమోటర్‌ సంస్థ హీనెకెన్‌ కంపెనీలో వాటాను పెంచుకున్నట్లు వెలువడ్డ వార్తలు యునైటెడ్‌ బ్రూవరీస్‌ షేరు జోరందుకుంది. డిసెంబరునాటికల్లా కంపెనీలో ప్రమోటర్లకు 43.7శాతం, విజ§్‌ు మాల్యాకు 8.08శాతం వాటా ఉన్నట్లు నమోదైంది. కాగా, ఇటీవల ప్రమోటర్లు 2.8శాతం వాటాకు సమానమైన 75 లక్షల యునైటెడ్‌ బ్రూవరీస్‌ షేర్లను ఓపెన్‌ మార్కెట్‌ ద్వారా కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది. బ్లాక్‌డీల్‌ ద్వారా షేరుకి రూ.1395ధరలో వీటిని సొంతం చేసుకున్నట్లు సంబంధిత వర్గాలు తెలియచేశాయి. దీంతో ఈ షేరు ప్రస్తుతం ఎన్‌ఎస్‌ఇలో 3.6శాతం పెరిగి రూ.1396వద్ద ట్రేడవుతోంది. మొదట ఒకదశలో రూ.1465వరకూ పుంజుకుంది.


మరిన్ని తాజా బిజినెస్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/news/business/