తెలుగు రాష్ట్రాలలో ఐసిఐసిఐ నూతన శాఖలు

icici
icici

హైదరాబాద్‌: తెలుగు రాష్ట్రాల్లో ఐసిఐసిఐ బ్యాంకు రిటైల్‌ నెట్‌వర్క్‌ను విస్తరిస్తోంది. ప్రస్తుతం ఆర్థిక సవంత్సరంలో రెండు రాష్ట్రాలలో 57 నూతన శాఖలను ప్రారంభిస్తున్నట్లు ఐసిఐసిఐ బ్యాంక్‌ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ అనుప్‌బగ్చి తెలిపారు. 2019-20లో దేశవ్యాప్తంగా 450 శాఖలను ప్రారంభించాలని బ్యాంకు నిర్ణయించింది. ఇందులో భాగంగా ఆంధ్రప్రధేశ్‌, తెలంగాణల్లో నూతన శాఖలను అమలు చేస్లున్నట్లు వివరించారు. కర్నూలు జిల్లాలోని కరివెన, మహబూబ్‌నగర్‌ జాల్లాలోని బోయినపల్లి గ్రామాలతో సహా హైదరాబాద్‌, విజయవాడ, తిరుపతి, విశాఖపట్నం తదితర ప్రాంతాత్లో శాఖలను విస్తరిస్తున్నారు. విస్తరణ పూర్తయితే, తెలుగు రాష్ట్రాల్లో 402కు పైగా శాఖలు, ఎక్స్‌టెన్ష్‌న్‌ కౌంటర్లు, 1,580పైగా ఎటిఎంలు ఉంటాయి.
తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/national/