వడ్డీ లేకుండా రుణం ఐసిఐసిఐ ఆఫర్‌

ICICI bank
ICICI bank

ముంబై: మీరు ఏదైనా స్మార్ట్‌ఫోన్‌గానీ, టివి, ఫ్రిజ్‌ వంటి కొనాలనుకునే వారికి ఐసిఐసిఐ బ్యాంకు ఒక గుడ్‌న్యూస్‌ అందిస్తోంది. మీకు ఐసిఐసిఐ బ్యాంకులో అకౌంట్‌ ఉన్నట్లయితే వడ్డీలేకుండా కొంత కాలానికి రుణం తీసుకోవచ్చు. వడ్డీ చెల్లించకుండా తిరిగి అసలు చెల్లిస్తే చాలు. ఐసిఐసిఐ పేలెటర్‌ ఆప్షన్‌ ఇది. వడ్డీలేని లోన్‌ తీసుకోవాలంటే మీరు బ్యాంకు నియమనిబంధలన్నీ అంగీకరించాల్సి ఉంటుంది. ఐసిఐసిఐ వెబ్‌సైట్‌లో ఉన్న సమాచారం ప్రకారం పేలేటర్‌ ఆప్షన్‌ ద్వారా వడ్డీ లేకుండా రుణం పొందవచ్చు. ఇది క్రెడిట్‌ కార్డులాగా పనిచేస్తుంది. మీకు కేటాయించిన లిమిట్‌ను వాడుకొని తర్వాత డబ్బులు చెల్లిస్తే చాలు.

మీరు తీసుకున్న అప్పు తిరిగి చెల్లించడానికి 45 రోజుల గడువు ఉంటుంది. ఈ సదుపాయం వాడుకోవడానికి పేలేటర్‌ అకౌంట్‌ క్రియేట్‌ చేయాల్సి ఉంటుంది. ముందుగా ఐసిఐసిఐ మొబైల్‌ యాప్‌లో పేలేటర్‌ అకౌంట్‌ పాప్‌అప్‌పైన యాక్టివ్‌ నౌ అనే ఆప్షన్‌ను క్లిక్‌ చేయండి. నియమనిబంధలన్నీ చదువుకొని టిక్‌ చేసి గెట్‌ఇట్‌పైన క్లిక్‌ చేయండి. మీ వ్యక్తిగత వివరాలు, ఆధార్‌ నంబర్‌, డెబిట్‌అకౌంట్‌ చెక్‌ చేసుకొని సబ్‌మిట్‌పైన క్లిక్‌ చేయాలి. ఆటోపేమెంట్‌ కోసం సేవింగ్స్‌ బ్యాంకు అకౌంట్‌ను సెలెక్ట్‌చేసుకోవాలి. వర్చువల్‌ పేమెంట్‌ అడ్రస్‌ విపిఎ క్రియేట్‌ చేయాలి. ఆ తర్వాత మీ పేలేటర్‌ అకౌంట్‌ క్రియేట్‌ అవుతుంది.

పేలేటర్‌ ఐకాన్‌పైన క్లిక్‌చేస్తే పాకెట్స్‌ డ్యాష్‌బోర్డ్‌లో వివరాలు కనిపిస్తాయి. పేలేటర్‌ అకౌంట్‌ క్రియేట్‌ చేసిన తర్వాత ఆన్‌లైన్‌లో షాపింగ్‌ చేసినా, మార్కెట్‌లోని షాపుల్లో వస్తువులు కొన్నా యుపిఐ ఐడి ద్వారా పేమెంట్‌ చేయొచ్చు. యువతను దృష్టిలో పెట్టుకొని ఐసిఐసిఐ పేలేటర్‌ సర్వీస్‌ అందిస్తోంది. క్రెడిట్‌ కార్డు లేనివారికి ఈ ఆప్షన్‌ బాగా ఉపయోగపడుతుంది. పేలేటర్‌ ద్వారా రూ.25వేల వరకు క్రెడిట్‌ లిమిట్‌ అందిస్తోంది ఐసిఐసిఐ. 45 రోజుల పేమెంట్‌ చేస్తే వడ్డీ చెల్లించాల్సిన అవసరం లేదు.

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/telengana/