చందా కొచర్‌పై బాంబే హైకోర్టుకు ఐసీఐసీఐ

చందా కొచర్‌ గత ఏడాది దాఖలు చేసిన పిటిషన్‌ను కొట్టివేయాలని విజ్ఞప్తి

Chanda Kochhar
Chanda Kochhar

ముంబయి: ఐసీఐసీఐ-వీడియోకాన్‌ కుంభకోణంలో ఐసీఐసీఐ బ్యాంకు బంబే హైకోర్టును ఆశ్రయించింది. ఈ స్కాములో ఆరోపణలు ఎదుర్కొంటున్న మాజీ సీఎండీ చందా కొచర్‌ నుంచి తామిచ్చిన బోనస్‌ను రికవరీ చేయాలని కోరింది. అలాగే తన తొలగింపు అక్రమమంటూ చందా కొచర్‌ గత ఏడాది దాఖలు చేసిన పిటిషన్‌ను కొట్టి వేయాలని కూడా విజ్ఞప్తి చేసింది. తన తొలగింపు ద్వారా ఆర్‌బిఐ నిబంధనలను ఉల్లఘించినట్లు పేర్కొనడం, బ్యాంకు విలువైన స్టాక్‌ ఆప్షన్‌ను పొందేందుకు, తప్పు దారి పట్టించే ప్రయత్నమని ఐసీఐసీఐ బ్యాంకు తన ఆఫడవిట్‌లో పేర్కొంది. ఈ మేరకు దావా వేసింది. దీనిపై తదుపరి విచారణ జనవరి 20కి వాయిదా పడింది. ఐసీఐసీఐ బ్యాంకు సీఈవో, ఎండీగా ఆమెను తొలగించిన తర్వాతా ఎప్రిల్‌ 2006-మార్చి 2018 వరకు ఆమెకిచ్చిన బోనస్‌ క్లాబ్యాక్‌ చేయాలని కోరుతుంది. బ్యాంకు వ్యాపార ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించి బ్యాంకుతోపాటు వాటాదారులందరికీ తీవ్రమైన ఇబ్బందిని కలిగించిందనీ, బ్యాంకు ప్రతిష్టకు తీరని నష్టం కలిగిందని ఆరోపించింది. తన భర్త దీప కొచర్‌కు లబ్ధి చేకూర్చడం కోసమే వీడియోకాన్‌ గ్రూపునకు రూ.2,250 కోట్ల రుణాలు మంజూరు చేయడంలో చందా కొచర్‌ పాత్ర ఉందని బ్యాంకు ఆరోపించింది.

తాజా ఏపీ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/andhra-pradesh/