ఐసెట్‌ మెలకువలు

కృషి చేస్తే ఉత్తమ కళాశాలల్లో సీటు

icet techniques

తెలుగురాష్ట్రాల్లోని అత్యుత్తమ కళాశాలల్లో ఎంబిఎ/ ఎంసిఎ చేసేందుకు ఇంటిగ్రేటెడ్‌ కామన్‌ ఎంట్రన్స్‌ పరీక్ష (ఐసెట్‌) రాయాల్సి ఉంటుంది. దీనిలో మంచి మార్కులు సాధిస్తే ఉత్తమ కళాశాలల్లో సీటు సంపాదించవచ్చు.

విజయవంతంగా కోర్సును పూర్తిచేసి పట్టా పొందితే మంచి భవిష్యత్తు ఉంటుంది. మరి ఇంత ముఖ్యమైన ఐసెట్‌కు ఎలా సిద్ధం కావాలో తెలుసుకుందాం!

ఐసెట్‌ సిలబస్‌తో పాటు ఇతర విధానాలు రెండు రాష్ట్రాల్లో ఒకేలా ఉంటాయి. రాతపరీక్షలో మొత్తం మూడు సెక్షన్లు ఉంటాయి. సెక్షన్‌ ఎ- ఎనలిటికల్‌ ఎబిలిటీ, సెక్షన్‌ బి- మ్యాథమేటికల్‌ ఎబిలిటీ, సెక్షన్‌ సి- కమ్యూనికేషన్‌ ఎబిలిటీ. ప్రణాళిక ప్రకారం చదివితే తేలికగా మార్కులు సాధించొచ్చు.

మౌలిక అంశాలపై సిద్ధం కావడం, మాక్‌ పరీక్షలు రాయడం అనే రెండు అంచెల్లో సన్నద్ధతను రూపొందించుకోవాలి. మొదటి అంచెకు ఎక్కువ సమయం తీసుకోరాదు.

కేవలం 10 నుంచి 15 రోజుల సమయం చాలు. అయితే గ్రాడ్యుయేషన్‌ చివరి సంవత్సరం చదువుతున్న విద్యార్థులు అకడమిక్‌ పరీక్షల షెడ్యూల్‌కు ఇబ్బంది లేకుండా సిద్ధం కావాలి.

ఎలా చదవాలి?:

సెక్షన్‌-బి నుంచి పరీక్షకు సిద్ధం కావడం మంచిది. సెక్షన్‌-బిలో నేర్చుకున్న అరిథ్‌మెటిక్‌ సెక్షన్‌-ఎకు కూడా ఉపయోగపడుతుంది. అందుకే ముందుగా అరిథ్‌మెటిక్‌ ఎబిలిటీ చూడాలి.

కాన్సెప్ట్‌లను అర్ధం చేసుకుంటే తేలికగా సమాధానాలు గుర్తించొచ్చు.

ఉదాహరణకు 2019లో తెలంగాణ ఐసెట్‌లో అడిగిన ప్రశ్నలను పరిశీలించండి.

ఒక వ్యక్తి ఒక వస్తువును రూ.18,000కు కొని సంవత్సరం తర్వాత కొన్న వెలలో 25శాతం తక్కువకు అమ్మాడు. అది అమ్మిన ధర ఎంత? ఈ ప్రశ్నకు సమాధానాన్ని రెండు పద్ధతుల్లో కనుగొనవచ్చు.

రూ.పద్దెనిమిది వేలకు 25శాతం కనుగొని, ఆ తర్వాత దానిని రూ.18,000 నుంచి తీసివేయడం ఒక పద్ధతి. లేకుంటే రూ.18,000 మొత్తానికి 75శాతం కనుగొనడం. రెండో పద్ధతిలో చేస్తే సమాధానం నేరుగా వస్తుంది. కాన్సెప్ట్‌ నేర్చుకుంటే ఇలాంటివి వాటంతట అవే వస్తాయి.

పాఠశాల స్థాయిపుస్తకాలు చదవడం ద్వారా ఈ కాన్సెప్ట్‌ను తేలిగా నేర్చుకోవచ్చు. ఇదే విధంగా ఆల్‌జీబ్రా, జామెట్రికల్‌ ఎబిలిటీ అంశాలకు సిద్ధం కావాలి. వీటికి పాఠశాల స్థాయిపుస్తకాలు సరిపోతాయి. ముందుగా మౌలిక అంశాలను చదివిన తర్వాత మాక్‌ పరీక్షలను రాయాలి.

సెక్షన్‌-ఎలో డాటా సఫిషియెన్సీ, ప్రాబ్లం సాల్వింగ్‌ అంశాలుంటాయి. సెక్షన్‌-బిలోని అరిథిమెటిక్‌ చదివినప్పుడు ప్రాథమిక అంశాలు ఇక్కడ ప్రత్యేకంగా సిద్ధం కావాల్సిన అవసరం లేదు.

రెండు స్టేట్‌మెంట్లను ఇచ్చి, సమాధానం కనుగొనేందుకు ఒకటే అవసరమా? లేక రెండు అవసరమా? రెండింటిని కూడా ఉపయోగించి కనుక్కోలేమా? అన్న అంశాన్ని పరిశీలిస్తే సరిపోతుంది.

తాజా అంతర్జాతీయ వార్తల కోసం: https://www.vaartha.com/news/international-news/