ఐసిసి ర్యాంకింగ్స్‌లో రాధా యాదవ్‌కు 2వ స్థానం

Radha Yadav
Radha Yadav

దుబాయ్‌: ఐసిసి మహిళల టీ20 ర్యాంకింగ్స్‌ను విడుదల చేసింది. బౌలింగ్‌ విభాగంలో భారత ఎడమ చేతివాటం స్పిన్నర్‌ రాధా యాదవ్‌ 769 పాయింట్లతో రెండో స్థానంలో కొనసాగుతుంది. ఇక ఆస్ట్రేలియాకు చెందిన స్టార్‌ బౌలర్‌ మెగాన్‌ స్కట్‌ 773 పాయింట్లతో మొదటి స్థానంలో నిలిచింది. కాగా భారత బౌలర్‌ దీప్తి శర్మ 726 పాయింట్లు, పూనమ్‌ యాదవ్‌ 716పాయింట్లతో ఒక్కో ర్యాంకును చేజార్చుకుని ఐదు, ఆరు ర్యాంకుల్లో నిలిచారు. ఇక బ్యాటింగ్‌ విభాగంలో భారత ప్లేయర్ల ర్యాంకులు జెమీమా రోడ్రిగ్స్‌ 699 పాయింట్లతో నాలుగో స్థానంలో, స్మృతి మంధాన 669 పాయింట్లతో ఐదో స్థానంలో, కెప్టెన్‌ హర్మన్‌ప్రీత్‌ కౌర్‌ 636 పాయింట్లతో తొమ్మిదో స్థానంలో కొనసాగుతున్నారు. కాగా న్యూజిలాండ్‌కు చెందిన బ్యాట్స్‌మన్‌ సుజీ బేట్స్‌ 768 పాయింట్లతో టాప్‌ ర్యాంకులో ఉంది. ఇకపోతే 179 పరుగులతో సత్తాచాటి ప్లేయర్‌ ఆఫ్‌ ది సిరీస్‌ గా నిలిచిన వికెట్‌ కీపర్‌-బ్యాట్స్‌మన్‌ జోన్స్‌ ర్యాంకింగ్స్‌లో దూసుకుపోయింది. ఏకంగా 30 స్థానాలు ఎగబాకి 17 స్థానంలోకి చేరింది. మహిళల జట్ల విభాగంలో భారత్‌ 260 పాయింట్లతో నాలుగో స్థానంలో నిలిచింది. కాగా ఈ ర్యాంకింగ్‌లో ఆస్ట్రేలియా(293) అగ్రస్థానం, ఇగ్లాండ్‌(280), న్యూజిలాండ్‌(276) తర్వాత స్థానాల్లో ఉన్నాయి.

తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి: