మాకు పసుపు-నీలం రంగు జెర్సీలే కావాలి

yellow-blue jersey
yellow-blue jersey

లండన్‌: ప్రపంచకప్‌లో ఇంగ్లాండ్‌తో మ్యాచ్‌లో పసుపు-నీలం రంగు జెర్సీలతో బరిలో దిగి విజయం సాధించడంతో అవి అదృష్ట జెర్సీలని శ్రీలంక నమ్ముతుంది. అందుకే వాటినే ధరించి మిగిలిన మ్యాచుల్లో ఆడాలని ఆ జట్టు నిర్ణయించింది. ఇందుకోసం లంక..ఐసిసి అనుమతి కూడా సంపాదించింది. సాధారణంగా ముదురు నీలం రంగు జెర్సీలను ధరించే శ్రీలంక ఆటగాళ్లు తర్వాత ఆడే మూడు మ్యాచుల్లో పసుపు-నీలం రంగు కలిసిన దుస్తుల్లో కనిపించనున్నారు. ప్రత్యేక విజ్ఞప్తి వల్ల శ్రీలంక ఈ జెర్సీలను ధరించేందుకు అనుమతి ఇస్తున్నామని ఐసిసి పేర్కొంది.

తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/news/national/