ఐసిసి వార్షిక ర్యాంకింగ్స్‌ విడుదల

టెస్టుల్లో భారత్‌, వన్డేల్లో ఇంగ్లాండ్‌ నంబర్‌వన్‌

INDIA, ENGLAND teams
INDIA, ENGLAND teams

ఐసిసి వార్షిక ర్యాంకింగ్స్‌ జాబితా విడుదల చేసింది. తాజాగా విడుదల చేసిన ర్యాంకింగ్స్‌లో టెస్టుల్లో భారత్‌, వన్డేల్లో ఇంగ్లాండ్‌ నంబర్‌ వన్‌ ర్యాంకును సొంతం చేసుకున్నాయి. వన్డే ర్యాంకింగ్స్‌లో ఇంగ్లాండ్‌(123)తో మొదటి స్థానంలో ఉండగా, భారత్‌(121) రెండో స్థానంలో నిలిచింది. ఇంగ్లాండ్‌, భారత్‌ జట్ట మధ్య తేడా కేవలం రెండు పాయింట్లు మాత్రమే. న్యూజిలాండ్‌ (113) జట్లును వెనక్కునెట్టి దక్షిణాఫ్రికా(115) మూడో స్థానాన్ని కైవసం చేసుకుంది. ఆ తర్వాత వరుసగా న్యూజిలాండ్‌, ఆస్ట్రేలియా, పాకిస్థాన్‌, బంగ్లాదేశ్‌, వెస్టిండీస్‌, శ్రీలంక, ఆఫ్ఘనిస్తాన్‌ టాప్‌ 10లో ఉన్నాయి.
టెస్ట్‌ ర్యాంకింగ్స్‌లో భారత్‌ (113)తో నంబర్‌వన్‌ స్థానాన్ని నిలబెట్టుకుంది. న్యూజిలాండ్‌(111) నుంచి పోటీ ఎదురైనా నంబర్‌వన్‌ ర్యాంకును కాపాడుకుంది. ఆ తర్వాత దక్షిణాఫ్రికా, ఇంగ్లాండ్‌, ఆస్ట్రేలియా, శ్రీలంక, పాకిస్థాన్‌, వెస్టిండీస్‌, బంగ్లాదేశ్‌, జింబాబ్వే ఆ తర్వాత స్థానాల్లో ఉన్నాయి.

తాజా బిజినెస్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/news/business/