సినీ లవర్స్ కు ఐబొమ్మ షాక్

ఐబొమ్మ..అతి తక్కువ టైంలోనే బాగా ఫేమస్ అయ్యింది. సినీ లవర్స్ కు ఇది గొప్పవరమైంది. కానీ ఇప్పుడు ఈ వరమే షాక్ ఇచ్చింది. తమ సర్వీసులను పూర్తిగా నిలిపివేయనున్నట్లు ప్రకటించి సినీ లవర్స్ కు షాక్ ఇచ్చింది. ఓటీటీకి వచ్చిన కొత్త సినిమాలను ఎలాంటి ఖర్చు లేకుండా హై క్వాలిటీతో ఫ్రీగా చూసేందుకు వెసులుబాటు కల్పిస్తూ వస్తుంది ఈ వెబ్‌సైట్‌. ఇప్పటికే డౌన్‌లోడ్‌ ఆప్షన్‌ తీసేసిన ఐబొమ్మ ..ఇప్పుడు శాశ్వతంగా తమ సేవలను నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది.

సెప్టెంబర్‌ 9నుంచి తమ ఇండియాలో తమ సర్వీసులను పూర్తిగా నిలిపివేస్తున్నట్లు తెలిపింది. అంతేకాదు భవిష్యత్తులో తిరిగి వచ్చే ఆలోచన కూడా లేదని, తమకు ఎవరు మెయిల్స్‌ చేయొద్దని యూజర్స్‌ను కోరింది. ఇంతకాలం తమపై చూపించిన ప్రేమకు అభినందలు చెప్పారు ఐబొమ్మ నిర్వహకులు.