సీఎం ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా జవహర్ రెడ్డి బాధ్యతలు

అమరావతి : సీఎం జగన్ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా కేఎస్ జవహర్‌రెడ్డి సోమవారం బాధ్యతలు చేపట్టారు. తాడేపల్లి సీఎం క్యాంపు కార్యాలయంలో జవహర్‌రెడ్డి విధుల్లో చేరారు. ఆయనకు పలువురు అధికారులు శుభాకాంక్షలు తెలిపారు. కాగా, ఇంతకుముందు ఆయన తిరుమల తిరుపతి దేవస్థానం(టీటీడీ) ఈవోగా పనిచేసిన విషయం తెలిసిందే.

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/telangana/