తెలంగాణలో ఐపిఎస్‌, ఐఏఎస్‌లకు పదోన్నతులు

government of telangana
government of telangana


హైదరాబాద్‌: తెలంగాణ రాష్ట్రంలో 26 మంది ఐఏఎస్‌, 23 మంది ఐపిఎస్‌లకు పదోన్నతులు కల్పించింది ప్రభుత్వం. కేంద్ర ఎన్నికల సంఘం అనుమతితో 49 మంది ఆల్‌ ఇండియా సర్వీసెస అధికారులకు పదోన్నతులు కల్పిస్తూ తెలంగాణ ప్రభుత్వం 15 జీవోలు జారీ చేసింది. ముగ్గురు ఐఏఎస్‌లకు ప్రత్యేక ప్రధాన కార్యదర్శులుగా , కేంద్ర సర్వీసుల్లో ఉన్న మరో ముగ్గురికి ప్రత్యేక ప్రధాన కార్యదర్శులుగా, ఒకరికి ముఖ్య కార్యదర్శి, నలుగురు కార్యదర్శులుగా, మరో ఆరుగురికి అదనపు కార్యదర్శులుగా, ఐదుగురు ఐఏఎస్‌లకు సంయుక్త కార్యదర్శులుగా పదోన్నతులు కల్పిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

తాజా హీరోల ఫోటోగ్యాలరీ కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/photo-gallery/actors/