కర్ణాటకలో కుప్పకూలిన వాయుసేన శిక్షణ విమానం!

బెంగుళూరు: భారత వైమానిక దళానికి చెందిన కిరణ్ శిక్షణ విమానం కర్ణాటకలో నేలకూలింది. చామరాజనగర్‌లోని మాకాలి గ్రామంలో ఆ విమానం క్రాష్ అయ్యింది. అయితే ఆ విమానంలో ఉన్న ఇద్దరు పైలెట్లు క్షేమంగా ఉన్నారు. లేడీ పైలెట్ కూడా క్షేమంగా ఉన్నట్లు అధికారులు చెప్పారు. ఈ ఘటన పట్ల విచారణకు ఆదేశించినట్లు ఐఏఎఫ్ అధికారులు వెల్లడించారు.
కాగా, రోజువారీ శిక్షణ కార్యకలాపాల్లో భాగంగా వాయుసేనకు చెందిన కిరణ్ శ్రేణి విమానం బెంగళరులోని ఎయిర్ ఫోర్స్ స్టేషన్ నుండి బయలుదేరింది. ఈ క్రమంలో చామరాజనగర్ సమీపంలోని భోగాపుర గ్రామంలో బహిరంగ ప్రదేశంలో కూలింది. ఈ ఘటనలో ఇద్దరు పైలట్లు భూమిక, తేజ్ పాల్ స్వల్ప గాయాలతో బయటపడ్డారు.