దాడిలో ఎంతమంది చనిపోయారన్నది తాము చెప్పలేం

BS Dhanoa
BS Dhanoa

కొయంబత్తూర్‌: పుల్వామా ఉగ్రదాడికి భారత్‌ ప్రతీకారంగా పాకిస్థాన్‌లోని బాలాకోట్‌లోని జైషే ఉగ్ర స్థావరంపూ దాడి చేసిన విషయం తెలిసిందే. అయితే ఈ దాడిలో ఎంతమంది ఉగ్రవాదులు హతమయ్యారన్న విషయంపై ఇంతవరకూ స్పష్టమైన సమాచారం లేదు. అటు ప్రభుత్వంగానీ, ఇటు వాయూసేన గానీ మృతుల సంఖ్యను అధికారికంగా వెల్లడించలేదు. అయితే కొయంబత్తూర్‌లో జరిగిన మీడియా సమావేశంలో బీఎస్‌ ధనోవా మాట్లాడుతు దాడిలో ఎంతమంది చనిపోయారన్నది తాము చెప్పలేమని వాయుసేనాధిపతి బీఎస్‌ ధనోవా అన్నారు.ఎక్కడెక్కడ దాడి చేయాలనే లక్ష్యాలపైనే మా దృష్టి ఉంటుంది. మా పనంతా లక్ష్యం నెరవేరిందా అనేదే చూస్తాం. అంతేగానీ చేసిన దాడుల్లో ఎంతమంది చనిపోయారు అన్నది ఎయిర్‌ఫోర్స్‌ లెక్కించదు. ఈ దాడిలో మా లక్ష్యం నెరవేరింది. బాలాకోట్‌ శిబిరంలో హతమైన ఉగ్రవాదుల సంఖ్యను వెల్లడించడం వంటివి ప్రభుత్వమే చూసుకుంటుంది. అక్కడ ఎంతమంది ఉన్నరాన్న దాన్ని బట్టి మృతుల సంఖ్య ఆధారపడి ఉంటుందిగ అని చెప్పారు. కాగా అభినందన్‌ స్వదేశానికి రావడం ఆనందంగా ఉందన్నారు.