సీఎం ఆదేశాల మేరకు నడుచుకుంటానన్న వెల్లంపల్లి

90 శాతం మంత్రులను మారుస్తానని జగన్ ముందే చెప్పారన్న మంత్రి

అమరావతి: ఏపీ మంత్రిగా మూడేళ్ల పాటు ఎంతో సంతృప్తికరంగా పని చేశానని వెల్లంపల్లి శ్రీనివాస్ అన్నారు. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినప్పుడే మధ్యలో 90 శాతం మంది మంత్రులను మారుస్తానని సీఎం జగన్ చెప్పారని.. ఆ ప్రక్రియ ఇప్పుడు ప్రారంభమయిందని చెప్పారు. జగన్ ఇచ్చిన పనిని సమర్థవంతంగా నిర్వర్తించడమే తన కర్తవ్యమని చెప్పారు.

అది పార్టీ బాధ్యత అయినా, ప్రభుత్వ బాధ్యత అయినా సీఎం ఆదేశాల మేరకు నడుచుకుంటానని తెలిపారు. కొన్ని రాజకీయ పార్టీలు రాష్ట్రంలో మత విద్వేషాలను రెచ్చగొట్టే ప్రయత్నం చేశాయని… అయితే ఆ కుట్రలను సమర్థవంతంగా ఎదుర్కొన్నామని చెప్పారు.

తాజా జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/news/national/