నేను అధిక మోజార్టీతో గెలవబోతున్న

Rajnath Singh
Rajnath Singh

లఖ్‌నవూ: లోక్‌సభ ఎన్నికల్లో భాగంగా ఈరోజు ఐదో విడత పోలింగ్‌ జరుగుతుంది. ఈసందర్భంగా బిజెపి అభ్యర్ధి రాజ్‌నాథ్‌ సింగ్‌ తన కుటుంబ సభ్యులతో కలిసి ఓటు వేశారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతు ఈ ఎన్నికల్లో కూడా తానే అధిక మెజార్టీతో గెలవబోతున్నట్లు తెలిపారు. బిజెపి ఈసారి మూడింట రెండొంతుల మెజార్టీని సొంతం చేసుకోనుందని ధీమా వ్యక్తం చేశారు. దేశవ్యాప్తంగా నేడు పోలింగ్‌ జరుగుతున్న స్థానాల్లో అందరూ తమ కుటుంబ సభ్యులతో సహా ఓటుహక్కును వినియోగించుకోవాలని రాజ్‌నాథ్‌ సింగ్‌ కోరారు.


మరిన్ని తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/national/