జెడిఎస్‌ శక్తి నిరూపిస్తా : దేవెగౌడ

Devegowda
Devegowda


బెంగళూరు: కర్ణాటక రాష్ట్రంలో ఉప ఎన్నికలు జరగాల్సిన ఉంది. 17 శాసనసభ నియోజకవర్గాలకు ఉప ఎన్నికలు జరగనున్నాయి. సంకీర్ణ ప్రభుత్వం కూలిపోవడానికి మాజీముఖ్యమంత్రి సిద్ధరామయ్యే కారణమని జెడిఎస్‌ అధినేత హెచ్‌డి దేవెగౌడ బహిరంగంగానే ధ్వజమెత్తారు. రాష్ట్రంలో ఉప ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో కాంగ్రెస్‌ పార్టీతో కలిసేందుకు సిద్ధం కావాలని సంకేతాలు ఇస్తున్నారు. కాంగ్రెస్‌, జెడిఎస్‌ పొత్తుపై కాంగ్రెస్‌ నాయకురాలు సోనియాగాంధీ ఆమోదానికి రావాలన్నారు. ఉప ఎన్నికలు జరిగే 17 నియోజకవర్గాల్లో 3 నియోజకవర్గాలు జెడిఎస్‌ ఎమ్మెల్యేలు ఉండగా, ఈ మూడు నియోజకరవర్గాలు జెడిఎస్‌ నుంచి తప్పిపోతాయేమోననే దేవెగౌడ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అందుకే జెడిఎస్‌తో మరోసారి పొత్తు పెట్టుకోవాలనే ప్రతిపాదన ముందుంచటం రాజకీయ రంగంలో చర్చనీయాంశమయింది. హెచ్‌.డి.దేవెగౌడ మాట్లాడుతూ రానున్న ఎన్నికల్లో జెడిఎస్‌ శక్తి ఏ పాటితో చూపిస్తానని, పార్టీ గురించి ఎవరు పడితే వారు మాట్లాడుతున్నారని, ఈ విషయాలన్నీ తెలిసినా మౌనంగా ఉన్నానని ఇకపై ఊరుకోనని ఇటువంటి మాటలకు అవకాశం ఇవ్వనని తేల్చి చెప్పారు. బెంగుళూరులో మాజీ మంత్రి డికె.శివకుమార్‌ అరెస్టును ఖండిస్తూ జరిగిన ధర్నాలో పాల్గొనాలని తనకు ఆహ్మానం వచ్చిందని, తాను మాజీ ప్రధానిని కావటంతో ఆ సభలో పాల్గొలేనని దేవెగౌడ పేర్కొన్నారు. పార్టీకి చెందిన మ్మెల్యేలు, కార్యకర్తలు పాల్గొన్నారని చెప్పారు.
తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి.. https://www.vaartha.com/news/national/