డబ్బు కోసమో, పదవి కోసమో టిడిపిని వీడబోను

Divya Vani
Divya Vani

అమరావతి: తాను టిడిపి పార్టీకి రాజీనామా చేసి, వైఎస్‌ఆర్‌సిపిలో చేరనున్నట్లు వస్తున్న వార్తలను నటి, టిడిపి ప్రతినిధి దివ్వవాణీ స్పందించారు. అయితే తాను టిడిపిని వీడబోనని, డబ్బు కోసమో, పదవి కోసమో తాను వైఎస్‌ఆర్‌సిపిలో చేరబోనని ఆమె స్పష్టం చేశారు. అయితే గడిచిన ఎన్నికల్లో వైఎస్‌ఆర్‌సిపికి 175 సీట్లూ వచ్చిన ఇంకా సంతోషించేదాన్నని, అప్పుడైనా చంద్రబాబునాయుడికి తన కుటుంబ సభ్యులతో గడిపేందుకు కాస్తంత సమయం లభించేదని సంచలన వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు ముద్దులొలికే మనవడితో గడిపేవారని అన్నారు. టిడిపిలో తాను ఇమడలేనని అనిపించిన నాడు, అధినేత చంద్రబాబుకు చెప్పిన తరువాతే పార్టీకి రాజీనామా చేస్తానని అన్నారు. ఏపీ ప్రజలు ఎన్నికల్లో ఇచ్చిన తీర్పును తాను స్వాగతిస్తున్నానని చెప్పారు. తనను వైసీపీ నుంచి ఎంతో మంది పిలిచారని, తాను డబ్బుకు ఆశపడే అమ్మాయిని కాదని అన్నారు.


తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/telengana/